Hair Fall : హెయిర్ ఫాల్ తో ఇబ్బంది పడుతున్నారా..? కుదుళ్లను పటిష్టం చేసే మ్యాజిక్ రెమిడీస్ ఇవిగో..!

షేర్ చేయండి:
Hair Fall : హెయిర్ ఫాల్ తో ఇబ్బంది పడుతున్నారా..? కుదుళ్లను పటిష్టం చేసే మ్యాజిక్ రెమిడీస్ ఇవిగో..!

సాక్షి లైఫ్ : మన బాహ్య సౌందర్యంలో శిరోజాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే నేటి ఆధునిక జీవనశైలిలో కాలుష్యం, మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల చాలా మంది జుట్టు రాలడం, చుండ్రు, పొడిబారడం వంటి సమస్యలతో సతమతమవు తున్నారు. మార్కెట్లో దొరికే రసాయన ఉత్పత్తుల కంటే, మన ఇంట్లోనే లభించే సహజసిద్ధమైన ఆయుర్వేద మూలికలతో ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్ 

ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

 

ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే తులసి, వేపలను ఉపయోగించి ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే కొన్ని అద్భుతమైన హెయిర్ మాస్క్‌లు, వాటి ప్రయోజనాలు మీకోసం...

1. తులసి - వేప బేసిక్ మాస్క్..

కావలసిన పదార్థాలు: తులసి ఆకులు 10 నుంచి 12, వేప ఆకులు 10-12, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు.

తయారీ విధానం..ముందుగా తులసి, వేప ఆకులను శుభ్రంగా కడిగి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇందులో కొబ్బరి నూనెను కలిపి మిశ్రమంగా సిద్ధం చేసుకోవాలి.

ఎలా ఉపయోగించాలి అంటే..? ఈ పేస్ట్‌ను తల చర్మానికి (Scalp), కుదుళ్లకు బాగా పట్టించి.. 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.

ప్రయోజనం: ఇది కుదుళ్లకు అవసరమైన పోషణను అందిస్తుంది. తలపై ఉండే హానికర బ్యాక్టీరియాను నశింపజేసి, కొత్త జుట్టు పెరిగేలా ప్రేరేపిస్తుంది.

 

2. కలబంద (aloevera) కాంబినేషన్..


కావలసిన పదార్థాలు: తులసి పేస్ట్ (1 స్పూన్), వేప పేస్ట్ (1 స్పూన్), అలోవెరా జెల్ (2 స్పూన్లు).

తయారీ విధానం: ఒక గిన్నెలో తులసి, వేప పేస్ట్‌లతో పాటు తాజా కలబంద జెల్‌ను వేసి బాగా కలుపుకోవాలి.

ఉపయోగించే పద్ధతి: ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని 25 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

ప్రయోజనం: వేసవిలో తల చర్మాన్ని చల్లబరచడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. చుండ్రు సమస్యను దూరం చేయడంతో పాటు జుట్టు దురదను తగ్గిస్తుంది.

 

3. పెరుగు - తేనెతో మృదువైన శిరోజాలు..

 

కావలసిన పదార్థాలు: తులసి-వేప పేస్ట్ (2 స్పూన్లు), గట్టి పెరుగు (3 స్పూన్లు), తేనె (1 టీస్పూన్).

తయారీ విధానం: పెరుగు, తేనె, తులసి-వేప పేస్ట్‌ను కలిపి చిక్కటి మిశ్రమంగా తయారుచేసుకోవాలి.

ఉపయోగించే పద్ధతి: ఈ మాస్క్‌ను కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు సమంగా పట్టించాలి. అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో కడిగేయాలి.

ప్రయోజనం: పెరుగు, తేనెలు తల చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి. జుట్టు చిక్కుబడకుండా, ఎంతో మృదువుగా, మెరుస్తూ ఉండేలా చేస్తాయి.

 

4. మెంతులు - ఆలివ్ ఆయిల్ ప్యాక్..

కావలసిన పదార్థాలు: నానబెట్టిన మెంతుల పేస్ట్ (2 స్పూన్లు), తులసి పేస్ట్ (1 స్పూన్), వేప పేస్ట్ (1 స్పూన్), ఆలివ్ నూనె (1 స్పూన్).

తయారీ విధానం: ముందురోజు రాత్రి నానబెట్టిన మెంతి గింజలను మెత్తగా రుబ్బుకోవాలి. అందులో తులసి, వేప పేస్ట్, ఆలివ్ ఆయిల్‌ను కలిపి ప్యాక్ సిద్ధం చేయాలి.

ఉపయోగించే పద్ధతి: తలకు రాసుకుని వేలి కొనలతో సున్నితంగా మసాజ్ చేయాలి. 40 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత తలస్నానం చేయాలి.

ప్రయోజనం: మెంతులలో ఉండే ప్రొటీన్లు జుట్టు రాలడాన్ని తక్షణమే అదుపు చేస్తాయి. కుదుళ్లను పటిష్టం చేసి జుట్టు ఒత్తుగా పెరగడానికి తోడ్పడతాయి. జుట్టు సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు అంతర్గత ఆరోగ్య కారణాలు కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ సహజ చిట్కాలతో పాటు సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం కూడా ముఖ్యమని మరువకండి.

 

ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్‌ బాధితులు వీళ్లే..  

ఇది కూడా చదవండి.. రాత్రి భోజనం తర్వాత నడిస్తే.. ప్రయోజనాలివే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.