JN.1 లక్షణాలు మునుపటి వేరియంట్స్ కంటే భిన్నంగా ఉంటాయా..?

షేర్ చేయండి:
JN.1 లక్షణాలు మునుపటి వేరియంట్స్ కంటే భిన్నంగా ఉంటాయా..?

సాక్షి లైఫ్ : JN.1 అనే కొత్త సబ్-వేరియంట్‌పై ఇప్పటివరకు పలురకాల అధ్యయనాలు నిర్వహించారు. మునుపటి వేరియంట్‌ ఒమిక్రాన్ మాదిరిగానే JN.1 వేరియంట్‌ సోకిన వ్యక్తులలో అవే లక్షణాలు కనిపిస్తున్నాయి."ఐతే JN.1 లక్షణాలు ఎంత తీవ్రంగా ఉంటాయి అనేది ఒక వ్యక్తి రోగనిరోధక శక్తి , మొత్తం ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఓ నివేదికలో తెలిపింది. ఇప్పటికీ చాలా మందిలో జ్వరం, గొంతునొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలు కనిపిస్తున్నాయి" అని సీడీసీ వెల్లడించింది.

 ఇంక్యుబేషన్ పీరియడ్ తోనే ఆందోళన..  

JN.1 స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి నిర్వహించిన అధ్యయనాల్లో  దాని ఇంక్యుబేషన్ పీరియడ్ కొందరిలో ఖచ్చితంగా ఆందోళన కలిగిస్తుందని గుర్తించారు శాస్త్రవేత్తలు. "ఇంక్యుబేషన్ పీరియడ్" అనేది ఒక వ్యక్తికి  వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్ వంటివి బహిర్గతం అయిన తర్వాత సంక్రమణ లక్షణాలు అభివృద్ధి చెందడానికి పట్టే సమయం.

కొత్త కరోనా వేరియంట్‌లలో వాటి ఇంక్యుబేషన్ పీరియడ్ లో క్రమంగా క్షీణత ఉన్నట్లు కనుగొన్నారు. సీడీసీ ప్రచురించిన పరిశోధనలో ఈ సమయాన్ని సగటున 2 నుంచి 3 రోజులు తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు.

నిపుణులు ఏమంటున్నారంటే..? 

పెరుగుతున్న కరోనా కేసులతోపాటు, కొత్త వేరియంట్ కేసులు కూడా మొదలవ్వడం కారణంగా, ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరిగిందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దాని స్వభావాన్ని బాగా అర్థం చేసుకోవడానికి నిరంతర పరిశోధనలు జరుగుతున్నాయని, కరోనా నివారణకు చర్యలు తీసుకోవడంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. కోవిడ్ సమయంలో పాటించిన విధంగా మాస్క్ ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం" అని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.