Can Noodles Be Fatal..? : నూడుల్స్ ప్రాణాలు తీస్తాయా..? ఒకే కుటుంబంలో ఐదుగురి మృతితో వెల్లువెత్తుతున్న ఆందోళన..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే నూడుల్స్ ప్రాణా పాయానికి దారితీస్తాయా..? గ్రేటర్ నోయిడాలోని రబూపురా ప్రాంతం నగలాశ్రీ పదం గ్రామంలో నూడుల్స్ తిని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించిన ఘటన ఇప్పుడు అందరినీ కలవర పెడుతోంది. శుక్రవారం రాత్రి నూడుల్స్ తిన్న భార్యాభర్తలు, వారి ముగ్గురు పిల్లలు మృత్యువాత పడటం వెనుక ఫుడ్ పాయిజనింగ్ ప్రధాన కారణంగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోస్ట్‌ మార్టం నివేదిక తర్వాతే అసలు కారణాలు తెలియనున్నప్పటికీ.. తరచూ జంక్ ఫుడ్ తినడం వల్ల పొంచి ఉన్న ముప్పుపై ఈ ఘటన మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.

ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..? 

ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. 

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

అసలు ప్రమాదం ఎక్కడంటే..

అప్పుడప్పుడు పరిమితంగా నూడుల్స్ తినడం వల్ల పెద్దగా ముప్పు లేకపోయినా, అదేపనిగా రోజూ తినడం అత్యంత ప్రమాదకరం. గత ఏడాది అమ్రోహాలో ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల పేగులు అతుక్కుపోయి 11వ తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. నూడుల్స్, ఫాస్ట్ ఫుడ్స్ జీర్ణవ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నూడుల్స్ తరచూ తినే అలవాటు వల్ల పండ్లు, కూరగాయలు, పప్పులు వంటి పోషకాహారం పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఫలితంగా శరీరానికి అవసరమైన ఫైబర్, ప్రోటీన్లు అందవు.

సోడియం ముప్పు..

ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో సోడియం మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది దీర్ఘకాలంలో అధిక రక్తపోటు (bp), గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

నూడుల్స్ తింటే మరణం సంభవిస్తుందా..?

సాధారణంగా నూడుల్స్ నేరుగా ప్రాణాలు తీయవు. కానీ, అవి తయారైన విధానం, నిల్వ ఉంచిన పరిస్థితుల వల్ల కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారొచ్చు.ఫుడ్ పాయిజనింగ్.. అత్యంత ప్రధానమైన ముప్పు కలుషితమైన ఆహారమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం.. కలుషితమైన ఆహారంలో వృద్ధి చెందే బ్యాక్టీరియా, వైరస్‌లు లేదా విషతుల్యాలు తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసి ప్రాణాలు తీస్తాయి.

ఉక్కిరిబిక్కిరి అవ్వడం.. చిన్న పిల్లలు నూడుల్స్ తినేటప్పుడు అవి గొంతులో లేదా శ్వాసనాళంలో ఇరుక్కుపోయి ఉక్కిరిబిక్కిరి అయి మరణించే ప్రమాదం కూడా ఉంటుంది. రోడ్డు పక్కన అపరిశుభ్రమైన వాతావరణంలో విక్రయించే నూడుల్స్, ఫాస్ట్ ఫుడ్స్ తినకపోవడమే ఉత్తమం. నూడుల్స్ లేదా మరేదైనా బయటి ఆహారం తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు, కడుపులో తీవ్రమైన నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?

ఇది కూడా చదవండి..మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..

ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.