Measles Deaths : 88శాతం తగ్గిన మీజిల్స్ మరణాలపై డబ్ల్యూ హెచ్ ఓ, సీడీసీ స్పందన..

సాక్షి లైఫ్ : గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా తట్టు (Measles) వ్యాధిపై సాగించిన పోరాటం ఫలించింది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు తట్టు సంబంధిత మరణాలు 88 శాతం మేర తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అండ్ యు.ఎస్. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) సంయుక్తంగా ప్రకటించాయి. వ్యాక్సిన్ల విస్తృత వినియోగం కారణంగా ఈ భారీ విజయం సాధ్యమైంది.

 

ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు.. 

ఇది కూడా చదవండి..Health care : అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందించే చెర్రీస్..

ఇది కూడా చదవండి..Methi side effects : మెంతులు ఎక్కువగా తీసుకున్నా సమస్యే.. 

 

అయితే, ఈ శుభవార్త వెనుకే ఒక ఆందోళన కలిగించే విషయం ఉంది. వ్యాధి మరణాల సంఖ్య తగ్గినప్పటికీ... గడచిన కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా తట్టు కేసుల సంఖ్య ఊహించని రీతిలో పెరుగుతోంది.

  కేసులు పెరుగుదలకు కారణం ఏమిటి..?

తట్టు ఒక అత్యంత వేగంగా వ్యాపించే వైరల్ అంటువ్యాధి. కేసుల పెరుగుదలకు ప్రధానంగా రెండు అంశాలు కారణమవుతున్నాయని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

1. టీకా అంతరాయం (Vaccine Interruption): కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు వేయాల్సిన సాధారణ టీకాల కార్యక్రమాలు, ముఖ్యంగా తట్టు టీకాలు (Measles Vaccines) ఆలస్యం అయ్యాయి లేదా పూర్తిగా ఆగిపోయాయి.

2. రోగనిరోధక శక్తి లోపం (Immunity Gap): నిర్ణీత సమయంలో టీకాలు వేయించుకోని లేదా ఒక్క డోస్ మాత్రమే తీసుకున్న చిన్నారుల సంఖ్య భారీగా పెరగడం వల్ల సామూహిక రోగనిరోధక శక్తి (Herd Immunity) తగ్గింది. దీనివల్ల వైరస్ సులభంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది.

 తట్టు వ్యాధిని నివారించడానికి రెండు డోసుల టీకా (Measles Vaccine) అత్యంత ప్రభావవంతమైనది. రెండు డోసులు తీసుకున్నవారిలో దాదాపు 97శాతం వరకు రక్షణ లభిస్తుంది. మరణాల తగ్గుదల ఆశాజనకంగా ఉన్నప్పటికీ, కేసులు పెరుగుదల అనేది భవిష్యత్తులో ఈ ఘోరమైన వ్యాధి మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని సూచిస్తోంది. ముఖ్యంగా పోషకాహార లోపం ఉన్న చిన్నారుల్లో ఈ వ్యాధి తీవ్రమై న్యుమోనియా, అతిసారం, అంధత్వం వంటి తీవ్రమైన ఉపద్రవాలకు దారితీస్తుంది.

భారత్‌లో పరిస్థితి..  

భారతదేశంతో సహా అనేక దేశాలలో తట్టు వ్యాప్తి మళ్లీ కనిపిస్తోంది. కోవిడ్ సంక్షోభం తర్వాత టీకా కార్యక్రమాలు మందగించడం వల్ల అనేక రాష్ట్రాల్లో కేసులు పెరిగినట్లు గత నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు నిర్దేశించిన సమయంలో తప్పనిసరిగా తట్టు టీకా (మీజిల్స్) డోసులు ఇప్పించాలని, తద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది.

 

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి.. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?

ఇది కూడా చదవండి..High-Calorie Fruits : అధిక కేలరీస్ ఉండే ఫ్రూట్స్ గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..For stress less life : మెంటల్ స్ట్రెస్ తగ్గించే ఆరోగ్యకరమైన నియమాలు 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : who who-report measles-vaccine measles what-is-measles measles-disease measles-symptoms diagnose-measles measles-diagnosis measles-is-caused-by measles-news measles-outbreak cdc cdc-report measles-epidemic
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com