High-Calorie Fruits : అధిక కేలరీస్ ఉండే ఫ్రూట్స్ గురించి తెలుసా..?
సాక్షి లైఫ్ : ఊబకాయం నేడు పెద్ద సమస్యగా మారింది. సకాలంలో దీనిని నియంత్రించకపోతే అనేక ఇతర సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడం చాలా ముఖ్యం. పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి, వ్యాయామం, ఆహారం అత్యంత ముఖ్యమైనదని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..For stress less life : మెంటల్ స్ట్రెస్ తగ్గించే ఆరోగ్యకరమైన నియమాలు
ఇది కూడా చదవండి.. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?
ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
మీరు బరువు తగ్గాలని అనుకుంటే తప్పనిసరిగా మీ ఆహారంలో పలురకాల మార్పులు చేసుకోవాలి. పండ్ల విషయంలో మామిడి, అరటిపండు వంటి పండ్లు బరువు తగ్గడానికి పని చేయవని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అలాంటి పండ్లలో ఎక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. ఎలాంటి పండ్లలో ఎక్కువ కేలరీలు ఉంటాయనేది.. ఇప్పుడు తెలుసుకుందాం..
ఎండు ద్రాక్ష..
ఎండుద్రాక్ష ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. ఎండుద్రాక్షలో కేలరీలు ఎక్కువ. ఒక కప్పు ఎండుద్రాక్షలో 500లకు పైగా కేలరీలు ఉంటాయి.
సరైన ఆహారంతో చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. పండ్ల వినియోగం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా, బరువు తగ్గే ప్రక్రియలో అవసరమైనదిగా పరిగణిస్తారు. అయితే కొన్ని రకాల పండ్లు బరువు తగ్గించడానికి బదులుగా బరువును పెంచుతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవాళ్ళు కొన్ని రకాల పండ్లను ఆహారంలో తీసుకోకుండా ఉండడం ఉత్తమమని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. అవేంటంటే..?
అరటిపండు..
అరటిపండులో ఎక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. మీడియం సైజ్ ఉన్న అరటి పండు అంటే 7 నుంచి 8 అంగుళాల పొడవు, 118 గ్రాముల బరువు ఉన్న పండులో 105 కేలరీలు ఉంటాయి.
బరువు పెరగాలనుకునే వారు అరటిపండ్లను తినొచ్చు. కానీ బరువు తగ్గాలనుకునే వారు అరటిపండ్లను తీసుకోకుండా ఉండడమే మేలని పరిశోధనలు సూచిస్తున్నాయి.
మామిడి..
మామిడిపండు చాలా రుచిగా ఉంటుంది. అయితే బరువు పెంచే పండ్లలో ఇది కూడా ఒకటి. ఒక కప్పు అంటే 165 గ్రాముల బరువున్న మామిడిపండ్ల ముక్కలలో 99 కేలరీలు ఉంటాయి. ఒక 25 గ్రాముల పిండి పదార్థాలుంటాయి.
ద్రాక్ష..
ద్రాక్షలో చక్కెర, కొవ్వు రెండూ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి రెండూ బరువును పెంచుతాయి. 100 గ్రాముల ద్రాక్షలో 67 కేలరీలు ఉంటాయి. 16 గ్రాముల చక్కెర ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే ద్రాక్షను తినకపోవడమే మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు.
అవకాడో..
అధిక కేలరీలున్న పండు అవోకాడో. 100 గ్రాముల అవోకాడోలో దాదాపు 160 కేలరీలు ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన కొవ్వుకు మంచి మూలం. కానీ అధికంగా తీసుకుంటే బరువును పెంచుతుంది. ఇది పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి.
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
