అద్భుతమైన ప్రయోజనాలు..అందించే జ్యూస్ లు.. 

సాక్షి లైఫ్ : అన్నిసీజన్లలో ఆరోగ్య ప్రయోజనాలు అందించే కూరగాయలు, పండ్లు ఉన్నాయి. అటువంటి వాటిలో బీట్ రూట్ , క్యారెట్ చాలా ప్రధానమైనవి. పండ్ల విషయంలో యాపిల్ చేసే మేలు అంతా ఇంతా కాదు.  చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే పండు ఇది. ఈ మూడురకాల జ్యూస్ లు తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటంటే..?  

బీట్‌రూట్ జ్యూస్.. 

శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించే లక్షణాలు బీట్ రూట్ లో ఉన్నాయి.  యాంటీఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇందులో  పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ల  నివారణలో బాగా ఉపయోడపడుతాయి. నైట్రేట్ కంటెంట్‌  ఎక్కువ. న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, నొప్పిని తగ్గించడానికి,  జీవక్రియనుమెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. 

యాపిల్ జ్యూస్.. 

ఈ జ్యూస్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్ , క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషించే ఫైబర్ యాంటీఆక్సిడెంట్లు వీటిలో ఎక్కువగా ఉన్నట్లు అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

క్యారెట్‌ జ్యూస్..  

క్యారెట్‌లో బీటా-కెరోటిన్ విటమిన్ "ఏ" ఎక్కువగా లభిస్తుంది. అంతేకాదు  కెరోటినాయిడ్స్, విటమిన్లు , డైటరీ ఫైబర్‌ కంటెంట్ కు క్యారెట్ మూలం. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ శరీరంలో ఉండే విషాన్ని తొలగిస్తాయి.

ఇది కూడా చదవండి.. స్కిన్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : abc-juice juice beetroot-juice apple-juice carrot-juice
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com