Lower Risk of Diabetes : కొండ ప్రాంతాల్లో నివసించే వారికి మధుమేహం ముప్పు తక్కువ: తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు!
సాక్షి లైఫ్ : మీరు కొండ ప్రాంతాలలో లేదా ఎత్తైన ప్రదేశాలలో నివసిస్తున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. ఎత్తైన ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మధుమేహం వచ్చే ముప్పు చాలా తక్కువని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆరోగ్య రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఎట్టకేలకు ఛేదించారు. గ్లాడ్‌స్టోన్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం, ఎత్తైన ప్రాంతాల్లో వాతావరణంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. తక్కువ ఆక్సిజన్ పరిస్థితులను తట్టుకోవడానికి మన శరీరంలోని ఎర్ర రక్త కణాలు (Red Blood Cells) తమ పనితీరులో కీలక మార్పులు చేసుకుంటాయి.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
రక్త ప్రవాహంలో..
ఈ రక్త కణాలు ఒక 'షుగర్ స్పాంజ్'లా మారి, రక్త ప్రవాహంలోని గ్లూకోజ్‌ను వేగంగా, భారీ పరిమాణంలో పీల్చుకుంటాయి. కణాలలో జరిగే ఈ మార్పు శరీర కణజాలాలకు ఆక్సిజన్‌ను సమర్థవంతంగా చేరవేయడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది.
షుగర్ లెవల్స్ నియంత్రణలో సహజ మార్పులు.. రక్తంలో చక్కెర తక్కువగా ప్రసరించడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం సహజంగానే తగ్గుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా శరీరానికి రెండు రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. తక్కువ ఆక్సిజన్ ఉన్నా శరీర భాగాలకు ఆక్సిజన్ అందేలా కణాలు సహకరిస్తాయి.
గ్లూకోజ్ రక్త కణాల్లోకి వెళ్లిపోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది. ఈ కీలక పరిశోధన 'సెల్ మెటబాలిజం' (Cell Metabolism) అనే జర్నల్‌లో ప్రచురితమైంది. శరీర విజ్ఞాన శాస్త్రంలో (Physiology) దీర్ఘకాలంగా ఉన్న ఒక చిక్కుముడికి ఈ అధ్యయనం పరిష్కారం చూపిందని సీనియర్ పరిశోధకురాలు ఈషా జైన్ తెలిపారు.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
