తేనీరు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు..

షేర్ చేయండి:
తేనీరు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు..

సాక్షి లైఫ్ : మన దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయాలలో "టీ" ఒకటి. చాలా మందికి "టీ" తాగడంతోనే రోజు మొదలవుతుంది. అంతేకాదు మరికొందరికైతే రోజు కూడా "టీ" తాగడంతోనే ముగుస్తుంది. అంతేకాదు రోజంతా ఆఫీసులో సహోద్యోగులతో స్నేహితులతో టీ తాగుతుంటారు. ముఖ్యంగా చలికాలంలో అయితే ఎక్కువసార్లు "టీ" తాగడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే "టీ" అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల పలురకాల దుష్ప్రభావాలు తలెత్తుతాయని చెబుతున్నారు వైద్యనిపుణులు.

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

 "టీ" ఎక్కువగా తాగడం వల్ల అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఏరకమైన "టీ", అయినా సరేవాటన్నింటిలో కెఫిన్ ఉంటుంది. గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ ఎలాంటి టీ అయినా అందులో తప్పనిసరిగా కెఫిన్ ఉంటుంది. ఇది క్రమంగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రిఫ్రెష్‌మెంట్ పేరుతో లేదా అర్థరాత్రి వరకు మేల్కొని పని పేరుతో టీ తాగేవారిలో మీరూ ఒకరైతే, జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే దాని వల్ల కలిగే హానిగురించి  తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

షుగర్ లెవల్స్.. 

రుచి కోసం కెఫిన్ టీకి చక్కెర కలుపుతారు. ఇలా పదేపదే తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి అసమతుల్యతకు దారితీస్తుంది. దీనికారణంగా మీకు డయాబెటిస్ సమస్య కూడా తలెత్తవచ్చు. అందువల్ల పదేపదే టీ తాగడం తగ్గించడం మంచిది. 

 ముఖంపై..  

టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల మొదట ముఖంపై చిన్న గీతలు ఏర్పడతాయి. ఆ తర్వాత అవి కొన్నాళ్ళకు ముడతలుగా మారుతాయి. దీని కారణంగా మీరు మీ వయస్సు కంటే పెద్దవాళ్లుగా కనిపిస్తారు. కాబట్టి టీ తాగడం మానుకోండి.

శరీరంలో నీటి శాతం.. 

బ్లాక్ "టీ", గ్రీన్ "టీ"రెండింటిలోనూ కెఫిన్ ఉంటుంది. ఇది డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. "టీ "ఎక్కువగా తాగడం వల్ల తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. దీంతో ఎక్కువ సార్లుమూత్ర విసర్జన చేయడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి, డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తుతుంది. 

ఒబెసిటీ సమస్య.. 
 
"టీ"లో చక్కెర ఉంటుంది. మీరు ఒక కప్పు "టీ"లో ఒక చెంచా చక్కెరను తీసుకుంటే, రోజుకు నాలుగు నుంచి ఐదు కప్పుల "టీ" తాగితే, మీరు టీతో పాటు ఎక్కువగా చక్కెరను తీసుకుంటు న్నారని అర్థం చేసుకోండి, దీని కారణంగా బరువు వేగంగా పెరుగుతారు. కాబట్టి రోజులో ఎక్కువసార్లు "టీ" తాగడం తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.  

 ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.