autism day: ఆటిజనానికి ప్రమాద కారకాలు ఏమిటి..?

సాక్షి లైఫ్ : ఆటిజం స్పెక్ట్రం డిసార్డర్ (ఏ ఎస్ డి) అనేది మానసికాభివృద్ధిపై ప్రభావం చూపించే నరాల సంబంధిత పరిస్థితి. ఇది వ్యక్తుల సామాజిక పరస్పర చర్యలు, సంభాషణలు, ప్రవర్తన, ఆసక్తులను ప్రభావితం చేయవచ్చు. ఆటిజం కారణాలు పూర్తిగా తెలియకపోయినప్పటికీ, శాస్త్రవేత్తలు జన్యుపరమైన పాత్ర ఉందని గుర్తించారు. కొన్ని లక్షణాలు పుట్టుకకు ముందే, లేదా సమస్య ప్రారంభ దశల్లో కనబడతాయి. ఆటిజం ముప్పును పెంచే కొన్ని ముఖ్యమైన ప్రమాద కారకాలు ఏమిటంటే..? 

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

ప్రసవ సమయంలో సమస్యలు.
పుట్టినప్పుడు శిశువు బరువు తక్కువగా ఉండటం.
కొన్ని క్రోమోజోములు లేదా జన్యుపరమైన పరిస్థితులు ఉండటం.
అకాల శిశువు జననం.. 

ఆటిజంను నివారించవచ్చా..?

ఆటిజంను నివారించలేము. అయితే, కొన్ని విషయాలు, జీవనశైలి మార్పులు ప్రమాదాన్ని తగ్గించగలవు,  
ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం మొదలైన వాటి సహాయంతో మంచి జీవనశైలిని అనుసరించడం ద్వారా కొంతమేర ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
 వైద్యులు సూచించిన మందులను మాత్రమే తీసుకోవాలి. అలాగే, గర్భధారణ సమయంలో ఏ మందులు సురక్షితమైనవో, ఏ మందులు వేసుకోకూడదో వారిని ఖచ్చితంగా అడగండి.


గర్భధారణ సమయంలో ఏ రకమైన ఆల్కహాల్, ఏ పరిమాణంలోనైనా సురక్షితం కాదు, కాబట్టి దానిని పూర్తిగా నివారించండి.
గర్భవతి అయ్యే ముందు, వైద్యులు సూచించిన అన్ని టీకాలను, జర్మన్ మీజిల్స్ (రుబెల్లా) టీకాతో సహా తీసుకోండి. ఈ టీకా రుబెల్లా సంబంధిత ఆటిజంను నివారిస్తుంది.

 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..ఆఫ్రికాలో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : autism-awareness-day autism autism-children autism-kids signs-of-autism-in-infants signs-of-autism-in-boys autism-symptoms-in-girls mild-autism my-child-is-diagnosed-with-autism-now-what autism-symptoms autism-diagnosis how-to-diagnose-autism early-signs-of-autism early-autism-diagnosis autism-research autism-therapy world-autism-day-2025 autism-awareness autism-acceptance support-for-autism understanding-autism autism-care
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com