Latest stady : కేవలం HbA1c టెస్ట్ తోనే డయాబెటిస్‌ను నిర్ధారించలేమంటున్న తాజా అధ్యయనాలు..
సాక్షి లైఫ్ : సాధారణంగా ఎవరికైనా షుగర్ వ్యాధి ఉందో లేదో తెలుసు కోవడానికి వైద్యులు సూచించే మొదటి పరీక్ష 'HbA1c'. గత మూడు నెలల సగటు రక్త చక్కెర స్థాయిని ఇది తెలియ జేస్తుంది. అయితే, కేవలం ఈ ఒక్క పరీక్ష ఆధారంగానే మధుమేహాన్ని నిర్ధారించడం దక్షిణాసియా వాసుల్లో ముఖ్యంగా భారతీయుల్లో సరికాదని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
సందేహం ఏంటి..?
సాధారణంగా HbA1c స్థాయి 6.5 కంటే ఎక్కువగా ఉంటే డయాబెటిస్ ఉన్నట్లు పరిగణిస్తారు. కానీ, మన ప్రాంత ప్రజల జన్యువుల రీత్యా లేదా రక్తహీనత (Anemia) వంటి ఇతర కారణాల వల్ల ఈ పరీక్షా ఫలితాలు వాస్తవ స్థాయి కంటే తక్కువగా లేదా ఎక్కువగా చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ముఖ్యమైన అంశాలు..
రక్తహీనత ప్రభావం.. మన దేశంలో మహిళల్లో రక్తహీనత ఎక్కువ. ఐరన్ లోపం ఉన్నప్పుడు HbA1c ఫలితాలు తప్పుగా వచ్చే అవకాశం ఉంది. గ్లూకోజ్ టాలరెన్స్..కేవలం HbA1c మాత్రమే కాకుండా, 'ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్' (OGTT) చేస్తేనే అసలు పరిస్థితి తెలుస్తుంది. మిస్సింగ్ డయాగ్నోసిస్.. కొన్ని సందర్భాల్లో HbA1c నార్మల్‌గా ఉన్నా, లోపల చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం చెబుతోంది.
డయాబెటిస్ నిర్ధారణ కోసం కేవలం ఒకే రకమైన పరీక్షపై ఆధార పడకుండా, ఫాస్టింగ్ (Fasting), పోస్ట్ లంచ్ (Post Lunch) గ్లూకోజ్ పరీక్షలతో పాటు HbA1cని సరిపోల్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా లక్షణాలు ఉండి, HbA1c నార్మల్‌గా వస్తే మరిన్ని లోతైన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యల విషయంలో తప్పనిసరిగా మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించండి.
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
