A.R. Rahman’s Fitness Secrets: ఏఆర్ రెహమాన్ ఫిట్‌నెస్ రహస్యం గురించి తెలుసా..?
సాక్షి లైఫ్ : ముప్పై ఏళ్ల ప్రాయం దాటాక ఆహారపు అలవాట్లే ఆరోగ్యానికి మూలస్తంభాలు. తాజాగా సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ తన ఫిట్‌నెస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గత పదేళ్లుగా తాను చక్కెర (Sugar) ముట్టుకోవడం లేదని, అన్నం కూడా చాలా తక్కువగా తీసుకుంటున్నానని ఆయన వెల్లడించారు. ‘కనీసం అప్పుడప్పుడు కూడా గులాబ్ జామున్ తినరా?’ అని అడిగిన ప్రశ్నకు.. ‘అస్సలు తినడం లేదు’ అంటూ ఆయన సమాధానమిచ్చారు. రెహమాన్ అనుసరిస్తున్న ఈ డైట్ పై ప్రముఖ మధుమేహ నిపుణులు పలు కీలక సూచనలు చేశారు.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే.
చక్కెరకు దూరంగా ఉంటే ఏం జరుగుతుంది..?
అదనపు చక్కెరలు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లను తగ్గించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు, ఇన్సులిన్ స్థిరంగా ఉంటాయని డాక్టర్ విజయ్ పేర్కొన్నారు. వయసుతో పాటు శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ సహజంగానే తగ్గుతుంది. చక్కెరను నియంత్రించడం వల్ల టైప్-2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్ మరియు అధిక బరువు ముప్పు తప్పుతుంది.
మనం చక్కెర ఎక్కువగా తీసుకున్నప్పుడు క్లోమం (Pancreas) అధికంగా ఇన్సులిన్‌ను విడుదల చేయాల్సి వస్తుంది. కాలక్రమేణా ఇది ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’కు దారితీస్తుంది. ఫలితంగా శరీరం చక్కెరను శక్తిగా మార్చడానికి బదులు కొవ్వుగా నిల్వ చేయడం ప్రారంభిస్తుంది.
అన్నం మానేయాల్సిందేనా..?
భారతీయ భోజనంలో అన్నం ప్రధాన భాగం. అయితే, పాలిష్ చేసిన తెల్ల బియ్యం చక్కెరలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచుతాయి.
అన్నం పూర్తిగా మానేయడం కంటే, దాని పరిమాణం (Portion size) తగ్గించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. కార్బోహైడ్రేట్లతో పాటు ప్రొటీన్లు, పీచు పదార్థం (Fiber), ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
నియంత్రణ ఉండాలి..
చక్కెరను పూర్తిగా వదిలేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అప్పుడ ప్పుడు చిన్న మొత్తంలో తీసుకోవడం వల్ల పెద్దగా నష్టం ఉండదు. కానీ పానీయాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఉండే ‘హిడెన్ షుగర్స్’ (Hidden Sugars) పట్ల అప్రమత్తంగా ఉండాలి.
కార్బోహైడ్రేట్లను పూర్తిగా దూరం చేస్తే నీరసం, పోషకాహార లోపం వచ్చే ప్రమాదం ఉంది. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయల ద్వారా లభించే పిండి పదార్థాలు శరీరానికి అవసరం. కఠినమైన నిర్ణయాల కంటే.. సమతుల్య ఆహారం ముఖ్యమని వైద్యనిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
