Banana : రోజుకో అరటి పండు తింటే.. ఇలాంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అరటిపండు అనేది అందరికీ అందుబాటులో ఉండే అద్భుతమైన పోషకాలు కలిగిన ఫలం. దీనిని సామాన్యుడి ఫలమని, పోషకాల గని కలిగిన పండు అని కూడా పిలుస్తారు. ప్రతి రోజూ ఒక అరటిపండు తీసుకోవడం వల్ల శరీరానికి అందే పొటాషియం, పిండి పదార్థాలు (Carbohydrates) మన ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయో నిపుణులు వివరించారు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..! 

 ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

 

ప్రతిరోజూ తింటే.. 

తక్షణ శక్తి (Energy Boost): అరటిపండులో ఉండే సహజ చక్కెరలు గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్, పిండి పదార్థాలు శరీరానికి తక్షణమే శక్తినిస్తాయి. అందుకే అథ్లెట్లు, వ్యాయామం చేసే వారు దీనిని ఇష్టపడతారు. ఇందులో పుష్కలంగా ఉండే పొటాషియం రక్తపోటును (Blood Pressure) నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సోడియం ప్రభావాన్ని తగ్గించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అరటిపండులో ఉండే 'పెక్టిన్' అనే ఫైబర్ మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. పేగు ఆరోగ్యానికి (Gut Health) మేలు చేసే ప్రీబయోటిక్స్‌ను ఇది అందిస్తుంది.

 ఇందులో ఉండే 'ట్రిప్టోఫాన్' అనే అమినో యాసిడ్ శరీరంలో సెరోటోనిన్ అంటే హ్యాపీ హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గి, మనసు ప్రశాంతంగా ఉంటుంది.

ఏ సమయంలో తీసుకోవవడం మంచిది అంటే..?


 పరగడుపున అరటిపండు తీసుకోవడం కంటే, బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు లేదా వ్యాయామానికి ముందు తీసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.

 అందరూ తినొచ్చా..? 

అరటిపండు ఆరోగ్యకరమే అయినా, అందరికీ ఒకేలా వర్తించకపోవచ్చు. బాగా పండిన అరటిపండులో గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్నవారు వైద్యుల సలహాతో పరిమితంగా తీసుకోవాలి. మూత్రపిండాల సమస్య ఉన్నవారు పొటాషియం స్థాయిలను గమనించుకోవాలి. అరటిపండును నేరుగా తినడమే కాకుండా, పెరుగు లేదా ఓట్స్‌తో కలిపి తీసుకోవడం వల్ల ఆ రోజంతా మీకు కావాల్సిన పోషకాలు సమతుల్యంగా అందుతాయని డైటీషియన్స్ చెబుతున్నారు.

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.