Teddy Bears : టెడ్డీ బేర్లు ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఫిబ్రవరి నెల వచ్చింది అంటే.. చాలు మార్కెట్లలో వాలెంటైన్స్ డే ఉత్సాహం కనిపిస్తుంది. కళాశాల, పాఠశాల పిల్లలు రోజ్ డే ,టెడ్డీ డే వంటి రోజులను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అదేవిధంగా, టెడ్డీ బేర్ డే కోసం మార్కెట్లలో అమ్మకానికి ఉన్న వివిధ రకాల టెడ్డీ బేర్‌ లు కనిపిస్తూ ఉంటాయి. 30 ఏళ్లు పైబడిన వారు వాటిని చూసి చిన్న పిల్లల ఆట బొమ్మలుగా భావిస్తారు. 

 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?  

 

టెడ్డీ బేర్ నిజంగా పిల్లల బొమ్మనా? కార్పొరేట్ జీవితంలోని హడావిడి, ఒత్తిడి, ఒంటరితనం నిశ్శబ్దం వంటివి నేటి తరాన్ని చుట్టుముడుతున్న తరుణంలో, టెడ్డీ బేర్ కేవలం బొమ్మ మాత్రమే కాదు.. భావోద్వేగ మద్దతును అందించే ఒక సాధనమని మానసిక నిపుణులు చెబుతున్నారు.

 ఒత్తిడి..

ఉదయం 9 నుంచి సాయంత్రం 6గంటల వరకూ చేసే ఉద్యోగాలతో శారీరకంగానే కాకుండా, మానసికంగా కూడా అలసిపోయేలా చేస్తున్నాయి. ల్యాప్‌టాప్ స్క్రీన్‌లు, కంప్యూటర్ స్క్రీన్ లతో ఎక్కువ సేపు  పనిచేసి  ఇంటికి వచ్చిన తర్వాత నాడీ వ్యవస్థ విశ్రాంతిని కోరుకుంటుంది. అటువంటి పరిస్థితులలో, మృదువైన ఆకృతి కలిగిన టెడ్డీ బేర్ లు మనస్సులను ప్రశాంతపరచడంలో సహాయపడతాయని పరిశోధకులు అంటున్నారు.

 మృదువైన దిండు లేదా టెడ్డీ బేర్‌ను కౌగిలించుకున్నప్పుడు, శరీరం ఆక్సిటోసిన్‌ను విడుదల చేస్తుంది, దీనిని కడిల్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది ఒత్తిడి, కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉన్న సమయంలో టెడ్డీ బేర్‌ను కౌగిలించుకోవడం ద్వారా ఆయా సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని రీసెర్చర్స్ వెల్లడిస్తున్నారు.

ఆందోళనను తగ్గించడంలో.. 
 
ప్రజెంట్ బరువున్న దుప్పట్ల మాదిరిగానే బరువున్న టెడ్డీ బేర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అవి కొంచెం బరువుగా ఉంటాయి. ఇవి ఒత్తిడి ఉద్దీపన సూత్రంపై పనిచేస్తాయి.టెడ్డీ బేర్స్ ను హృదయానికి హత్తుకున్నప్పుడు, సాంత్వనను అందిస్తాయి. భయాందోళన సమయంలో ఆందోళనను తగ్గించి మంచి రిలీఫ్ పొందడానికి ఇది ఒక బెస్ట్ వే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.