పరీక్షల సమయంలో పిల్లలకు జంక్ ఫుడ్ ఇస్తున్నారా..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మండుటెండల సమయంలో పిల్లలకు అందించే ఫుడ్ మెనూలో కొన్నిరకాల మార్పు చేర్పులు చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో ఏదిపడితే అది ఇవ్వకూ డదని వారు అంటున్నారు. మీ చిన్నారుల ఆరో గ్యకరమైన ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం.. 

జంక్ ఫుడ్.. 

వేసవి కాలంలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వంటివి కాకుండా హెల్దీ ఫుడ్ ను అందించాలి. ముఖ్యంగ విద్యార్థులు ఎగ్జామ్స్ సమయంలో తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తినే సమయంలో అసలు పరీక్షల గురించి ఆలోచించకూడదు. ప్రశాంతంగా తినాలి. సరిగా తినకపోవడంవల్ల నీరసంగా అనిపిస్తుంది. ఈ కారణంగా చదవాల నిపించదు. అలా అని ఎక్కువగా తిన్నా కూడా ప్రమాదమే. మితహారం చాలా మంచిది. పప్పుదినుసులు, పాలు, గుడ్లు, ఆకుకూరలు వంటి తేలికపాటి ఆహారాన్ని మాత్రమే విద్యార్థులకు పెట్టాలి. 

ఇది కూడా చదవండి.. New study : మీ బెడ్ రూమ్ ఎంత సేఫ్ ..? పిల్లో కవర్‌లో మిలియన్ల కొద్దీ బ్యాక్టీరియాలు..  

జ్ఞాపకశక్తి.. 

మసాలా, నూనె పదార్థాలు తీసుకోకూడదు. అరటిపండుతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. స్వీట్లు, శీతల పానీయాలు, పానీపూరి, చాక్లెట్లకు దూరంగా ఉండాలి. అల్పాహారంగా ఇడ్లీ, దోశె, అటుకులు మంచిది. మధ్యాహ్నం అన్నంలో పప్పు, కూరగాయల సలాడ్ తీసుకుంటే మంచిది. రాత్రి అన్నం బదులుగా చపాతి, జొన్నరొట్టె, మసాలా లేని, నూనె తక్కువగా ఉండే కూరలను తినాలి. ఈ సమయంలో సమతుల ఆహారం చాలా అవసరం. టీ, కాఫీల జోలికి వెళ్లకపోవడం మంచిది. 

మెదడు పనితీరుపై ప్రభావం.. 

 జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండండి. ఆహారం జ్ఞాపశక్తిపై ప్రభావం చూపిస్తుందన్న విషయం మరవద్దు. ప్రతిరోజూ ఖచ్చితంగా విటమిన్ ‘డి’కోసం సూర్యకిరణాలు తాకేలా ప్లాన్ చేసుకోవాలి. "డి" విటమిన్ మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. విద్యార్థులతో కలిసి భోజనం చేయడంవల్ల వారిలో ఆత్మవిశ్వాసం బలపడుతుంది. పరీక్షల గురించి ఆందోళన కలిగిస్తే సరిగ్గా భోజనం చేసే పరిస్థితి కూడా ఉండదు. 

ఒత్తిడి.. 

ఆత్మవిశ్వాసమే బలం. దీనికి మించిన టానిక్ లేదు. ఒత్తిడిని జయించడం కూడా మన చేతుల్లోనే ఉంది. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ వారి అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు వాటిని తీరుస్తుండాలి. విద్యార్థులు కొన్నిసార్లు వేళకి భోంచేయరు. అటువంటి సమయంలో ఇష్టమైన వంటలు చేసిపెట్టాలి. పరీక్షల సమయంలో పిల్లల ఆరోగ్యం ఎంతో ముఖ్యం. కావలసినంత శుభ్రమైన నీరు తాగమని చెప్పాలి. 

ఇది కూడా చదవండి.. మంచి పుచ్చకాయను ఎలా గుర్తించాలి..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.