New study : మీ బెడ్ రూమ్ ఎంత సేఫ్ ..? పిల్లో కవర్‌లో మిలియన్ల కొద్దీ బ్యాక్టీరియాలు..
సాక్షి లైఫ్: ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లు మన జీవితాలను హైజాక్ చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. వీటి నుంచి బయటపడటం చాలా కష్టంగా మారింది. ఎక్కువసేపు స్క్రీన్ లపై గడపడంవల్ల అలసట, బలహీనత, నిద్రలేమితో ప్రజలు బాధపడుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలేమి అనేది తీవ్రమైన సమస్య. మరుసటి రోజు దాని ప్రభావాలు కనిపిస్తుంటాయి. రోజంతా మూడ్ చెడిపోతుంది. చాలా లేజీగా అనిపిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
సమయానికి రాత్రి భోజనం..
ఆరోగ్యకరమైన శరీరానికి 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరిగా అవసరం. అయితే ప్రశాంతంగా నిద్రపోవాలంటే, సమయానికి రాత్రి భోజనం చేయడం, ఆరోగ్యకరమైనఫుడ్ తినడం, నిద్రపోయే అరగంట ముందు గాడ్జెట్‌లకు దూరంగా ఉండటం వంటివి చాలా ముఖ్యం. పడకగది వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
తాజా నివేదిక..
నిద్రకు ఎలాంటి వాతావరణం అవసరం అనేదాని గురించి తాజా నివేదికను వెల్లడించింది. ఇందులో ఒక వారంలో 3 మిలియన్ బ్యాక్టీరియాలు ఉతకని దిండు కవర్‌లో ఉన్నాయని, ఇది టాయిలెట్ సీటు కంటే 17,000 రెట్లు ఎక్కువ కలుషితమని తేలింది. అదేవిధంగా, బాత్రూమ్ డోర్ హ్యాండిల్స్ కంటే 24,631 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియాను ఉతకని బెడ్‌షీట్‌లు కలిగి ఉన్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది.
ఈ ఫలితాలు చూస్తే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ ఈ అధ్యయన ఫలితాల ఆధారంగా జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. మీరు ఈ విషయాలపై శ్రద్ధ చూపడం ద్వారా మీ నిద్ర నాణ్యతను మెరుగుపరచవచ్చు.
ఇది కూడా చదవండి.. నిద్రనాణ్యత ను ఎలా మెరుగు పరుచుకోవాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
