లిపోప్రోటీన్ గ్లోమెరులోప‌తి అనేది అత్యంత అరుదైన వ్యాధా..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : లిపోప్రోటీన్ గ్లోమెరులోప‌తి అనేది అత్యంత అరుదైన వ్యాధి.ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టికి కేవ‌లం 200 కేసులు మాత్ర‌మే బ‌య‌ట‌ప‌డ్డాయి. అవి కూడా చైనా, జ‌పాన్ దేశాల్లోని పెద్ద‌ల‌కు మాత్ర‌మే వ‌చ్చాయి. ఈ రెండు దేశాల్లో కూడా ఇవి రావడంచాలా త‌క్కువ‌. క‌ర్నూలుకు చెందిన ఓ నాలుగేళ్ల బాలుడికి ఇటీవల ఈ వ్యాధి వచ్చింది. ద‌క్షిణ భార‌త‌దేశం మొత్త‌మ్మీద ఇదే మొట్ట‌మొద‌టి కేసుగా పరిగణి స్తున్నారు వైద్యులు. సహజంగా ఇలాంటి వ్యాధి ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌ల్లో మాత్ర‌మే కనిపించింది.

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

లిపోప్రోటీన్ గ్లోమెరులోప‌తి (Lipoprotein Glomerulopathy) అనేది ఒక అరుదైన కిడ్నీ వ్యాధి. ఈ వ్యాధి వచ్చినవారిలో కిడ్నీలోని గ్లోమెరులలో లిపోప్రోటీన్ల స్వరూపం మారిపోతుంది. దీని కారణంగా మూత్రంలో ప్రోటీన్ లీకేజి అవుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా పెద్దవాళ్లలో కనిపిస్తుంది. కానీ చాలా అరుదుగా మాత్రమే చిన్నారులలో వస్తుంది.  

కానీ చిన్న చిన్నపిల్లల్లో అరుదుగా వచ్చే ఈ డిసీజ్. కేవలం నాలుగేళ్ల వ‌య‌సులో రావ‌డం ప్ర‌పంచంలోనే ఇదే మొట్ట‌మొద‌టి సారి అని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. ఏపీఓఈ జ‌న్యు మ్యుటేష‌న్ వ‌ల్ల‌ కొలెస్ట‌రాల్‌, ట్రైగ్లిజ‌రైడ్స్ పెరిగి, అవి కిడ్నీలో పేరుకుపోయి, దానివ‌ల్ల మూత్రంలో ప్రోటీన్ లీకేజి, కిడ్నీ ఫెయిల్ అవుతుంది. ఈ వ్యాధిని ఎంత త్వ‌ర‌గా గుర్తిస్తే దానికి అంత స‌మ‌ర్థ‌మైన చికిత్స చేయవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.  

 

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.