Kids health : పిల్లల్లో డెంగ్యూ ఫీవర్ ఎందుకు ప్రాణాంతకం..?
సాక్షి లైఫ్ : డెంగ్యూ జ్వరం రోజురోజుకీ ప్రమాదకర వ్యాధిగా మారుతోంది. ముఖ్యంగా చిన్నారుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. సరైన సమయంలో లక్షణాలను గుర్తించి చికిత్స తీసుకోకపోతే, ఈ వ్యాధి ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏ వయసు వారికైనా డెంగ్యూ వస్తుంది. కానీ, పిల్లలపై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
పిల్లల్లో ఎక్కువ ప్రమాదం..
డెంగ్యూ వచ్చినప్పుడు కొందరిలో ప్లేట్‌లెట్స్ సంఖ్య వేగంగా తగ్గిపోతుంది. ఇది వ్యాధిని మరింత ప్రమాదకరంగా మార్చుతుంది. సాధారణంగా డెంగ్యూ లక్షణాలు 2 నుంచి 7 రోజుల వరకు కనిపిస్తాయి. పిల్లలు ఆటల కోసం ఇంటి బయట పార్కుల్లో, గడ్డిలో తిరుగుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో డెంగ్యూ దోమల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లక్షణాలను సకాలంలో గుర్తించాలి..
"పిల్లల్లో డెంగ్యూ లక్షణాలను తొలి దశలోనే గుర్తిస్తే, సకాలంలో చికిత్స అందించడం ద్వారా ప్రమాదాన్ని తప్పించవచ్చు" అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటివి డెంగ్యూ సంకేతాలు. ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
నివారణ చాలా ముఖ్యం..
డెంగ్యూ దోమలు నిల్వ నీటిలో వృద్ధి చెందుతాయి కాబట్టి, ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పిల్లలు బయటకు వెళ్లినప్పుడు పూర్తి దుస్తులు ధరించేలా చూడాలని, దోమల నివారణ క్రీములు వాడాలని నిపుణులు చెబుతున్నారు. "సకాలంలో చికిత్స, నివారణ చర్యలతో డెంగ్యూ ప్రాణాంతకం కాకుండా చూడవచ్చు" అని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
