Protect Your Children in Rainy Season : రెయినీ సీజన్ లో పిల్లలను ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోండిలా..!
సాక్షి లైఫ్ : వర్షాకాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల చిన్న పిల్లలు త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. గాలిలో తేమ శాతం పెరగడంతో బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఈ సీజన్‌లో పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ముఖ్యంగా వారి ఆహార విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
1. వీధి ఆహారానికి దూరం పెట్టండి..!
వర్షాకాలంలో రోడ్డు పక్కన దొరికే చాట్, పానీపూరి, పకోడీల వంటి తినుబండారాలకు పిల్లలను వీలైనంత దూరంగా ఉంచాలి. బయట ఆహారాల తయారీలో వాడే నీరు, నూనె కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పిల్లల్లో గ్యాస్ట్రోఎంటరైటిస్, ఫుడ్ పాయిజనింగ్, కడుపునొప్పి వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, ఇంట్లోనే శుభ్రంగా తయారుచేసిన వేడివేడి పదార్థాలనే పిల్లలకు అందించడం సురక్షితం.
2. కట్ చేసిన పండ్లు, నిల్వ ఆహారాలు వద్దు..
చాలామంది పండ్లను ముందే కోసి పక్కన పెడుతుంటారు. అయితే వర్షాకాలంలో ఇలా బయట ఉంచిన పండ్లపై బ్యాక్టీరియా, దుమ్ము సులభంగా చేరుతాయి. అలాగే ఫ్రిజ్‌లో పెట్టిన పాత ఆహార పదార్థాల్లో ఫంగస్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే, పిల్లలకు ఎప్పటికప్పుడు తాజాగా కోసిన పండ్లను, అప్పటికప్పుడు వండిన వేడి ఆహారాన్ని మాత్రమే తినిపించాలి.
3. శీతల పానీయాలకు ‘నో’ చెప్పండి..
ఈ సీజన్‌లో కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌లు, చల్లటి పండ్ల రసాలు తాగడం వల్ల పిల్లల్లో టాన్సిల్స్, గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలు త్వరగా వస్తాయి.వీటికి బదులుగా, నీటిని బాగా కాచి, చల్లార్చి పిల్లలకు తాగించాలి. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండటానికి రోజంతా తగినంత స్వచ్ఛమైన నీటిని అందించడం ఎంతో ముఖ్యం. వర్షాకాలంలో పిల్లలకు పరిశుభ్రమైన పరిసరాలు, తాజా వేడి ఆహారం, కాచి చల్లార్చిన నీటిని అందించడం ద్వారా వారి రోగనిరోధక శక్తిని పెంపొందించి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
