World's First Blood Transfusion : ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రక్త మార్పిడి ప్రయోగం ఎలా జరిగిందో తెలుసా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నేడు వైద్య రంగం ఎంతగానో అభివృద్ధి చెందింది. ప్రమాదాలు జరిగినప్పుడో, శస్త్రచికిత్సల సమయాల్లోనో అవసరమైన వారికి రక్తాన్ని మార్పిడి చేయడం (Blood Transfusion) చాలా సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. కానీ, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ రక్త మార్పిడి ప్రయోగం ఎలా జరిగిందో తెలుసా..? వినడానికి కాస్త ఆశ్చర్యంగా, భయానకంగా అనిపించినా.. ఆనాడు ఒక మనిషి ప్రాణాలు కాపాడటానికి గొర్రె రక్తాన్ని ఎక్కించారు.మానవ వైద్య చరిత్రలో అత్యంత కీలకమైన, ఆసక్తికరమైన ఆ సంఘటన గురించిన సాక్షి లైఫ్ ప్రత్యేక కథనం మీకోసం..

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

జ్వరంతో బాధపడుతున్న బాలుడిపై ప్రయోగం..!

అది 1667వ సంవత్సరం, జూన్ 15. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు జీన్-బాప్టిస్ట్ డెనిస్ వద్దకు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఒక 15 ఏళ్ల బాలుడు వచ్చాడు. ఆ రోజుల్లో రక్త మార్పిడి గురించి ఎటువంటి శాస్త్రీయ అవగాహన గానీ, పరిశోధనలు గానీ లేవు. బాలుడి పరిస్థితి విషమించడంతో, డాక్టర్ డెనిస్ ఒక సాహసోపేతమైన, అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక గొర్రె రక్తాన్ని సేకరించి, ఆ బాలుడి శరీరంలోకి ప్రవేశపెట్టారు.

వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ..

వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ఈ ప్రయోగం మొదటి ప్రయత్నంలో విజయవంతమైంది. గొర్రె రక్తం ఎక్కించిన తర్వాత ఆ బాలుడు కోలుకోవడమే కాకుండా, అతని ఆరోగ్యం కూడా మెరుగైంది. ఈ విజయంతో ఉత్సాహం తెచ్చుకున్న డాక్టర్ డెనిస్, మరికొంతమంది రోగులపై కూడా ఇదే తరహా ప్రయోగాలు చేశారు. అయితే, అదృష్టం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు కదా! ఆ తర్వాత గొర్రె రక్తం ఎక్కించిన కొందరు రోగులు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు.

రోగుల మరణాలతో..

రోగుల మరణాలతో ఫ్రాన్స్‌లో తీవ్ర కలకలం రేగింది. ఒక రోగి మృతి చెందిన నేపథ్యంలో డాక్టర్ డెనిస్‌పై ఏకంగా 'హత్య' ఆరోపణలు వచ్చాయి. కోర్టు విచారణ జరిపి, ఆయనను నిర్దోషిగా ప్రకటించిన ప్పటికీ, ఈ ఘటనతో వైద్య ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనితో జంతువుల రక్తాన్ని మనుషులకు ఎక్కించే ప్రయోగాలపై నిషేధం విధించారు. ఈ భయాందోళనల కారణంగా దాదాపు 200 సంవత్సరాల పాటు రక్త మార్పిడిపై ఎలాంటి పరిశోధనలు జరగలేదు.

'బ్లడ్ గ్రూపుల' ఆవిష్కరణ..

రక్త మార్పిడి చరిత్రలో అసలైన మైలురాయి 1900వ సంవత్సరంలో నమోదైంది. ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్‌స్టీనర్ మానవ రక్తంలో వేర్వేరు రకాలు (Blood Groups) ఉంటాయని కనుగొన్నారు. ఒకరి రక్తం ఇంకొకరికి పడాలంటే బ్లడ్ గ్రూపులు కలవడం ఎంత ముఖ్యమో ఆయన ప్రపంచానికి చాటిచెప్పారు. ల్యాండ్‌స్టీనర్ చేసిన ఈ చారిత్రాత్మక ఆవిష్కరణే నేడు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతున్న సురక్షిత రక్త మార్పిడి విధానానికి గట్టి పునాది వేసింది.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.