Heart Attack- Kidney : కిడ్నీ రోగుల్లో హార్ట్ ఎటాక్ రావడానికి కారణం ఇదే..!
సాక్షి లైఫ్ : మూత్రపిండాల (kidney) సమస్యలతో బాధపడే వారిలో సగం మందికి పైగా గుండె సంబంధిత వ్యాధుల వల్లే ప్రాణాలు కోల్పోతున్నట్లు వైద్య గణాంకాలు చెబుతున్నాయి. అసలు కిడ్నీలు దెబ్బతింటే గుండె ఎందుకు ఆగిపోతుంది..? ఈ రెండు ప్రధాన అవయవాల మధ్య ఉన్న అంతర్గత సంబంధం ఏమిటి..? అనే ప్రశ్నలకు శాస్త్రవేత్తలు ఎట్టకేలకు సమాధానం కనుగొన్నారు. కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు అవి విడుదల చేసే కొన్ని 'విషపూరిత సూక్ష్మ కణాలు' గుండెను నేరుగా దెబ్బతీస్తున్నట్లు తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఆ విషపూరిత 'సూక్ష్మ కణాలు' (Extracellular Vesicles) ఏమిటి..?
శరీరంలో కిడ్నీల వ్యాధి ముదిరినప్పుడు, అవి రక్తాన్ని సరిగ్గా శుద్ధి చేయలేవు. ఈ క్రమంలో దెబ్బతిన్న కిడ్నీల నుంచి అత్యంత సూక్ష్మమైన కణాలు (Extracellular Vesicles) విడుదలవుతాయని పరిశోధకులు గుర్తించారు. ఇవి రక్తప్రవాహం ద్వారా నేరుగా ప్రయాణించి గుండె కణజాలానికి చేరుకుంటాయి.
గుండెపై ..
కిడ్నీల నుంచి వచ్చే ఈ సూక్ష్మ కణాలు గుండెకు చేరుకున్నాక, అక్కడ కణాల సాధారణ పనితీరును మందగించేలా చేస్తాయి. దీనివల్ల గుండెపై పడే ప్రతికూల ప్రభావాలు ఇవే..
కండరాలు బలహీనపడటం..గుండె కండరాలు క్రమంగా గట్టిపడి, రక్తాన్ని పంపింగ్ చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి.
తీవ్రమైన వాపు (Inflammation)..గుండె కణజాలంలో తీవ్రమైన వాపు ఏర్పడి, అది గుండెపోటుకు (హార్ట్ ఎటాక్) దారితీస్తుంది.
లయ తప్పడం (Arrhythmias)..గుండె కొట్టుకునే వేగంలో అకస్మాత్తుగా హెచ్చుతగ్గులు ఏర్పడి ప్రాణాంతకంగా మారుతుంది.
సరికొత్త చికిత్సలకు మార్గం..
ఇప్పటివరకు కిడ్నీ రోగులకు ఇచ్చే సాధారణ గుండె మందులు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వడం లేదు. అయితే, తాజా పరిశోధనల నేపథ్యంలో.. కిడ్నీల నుంచి విడుదలయ్యే ఈ విషపూరిత సూక్ష్మ కణాలను ప్రారంభంలోనే అడ్డుకోగలిగితే, కిడ్నీ రోగుల్లో గుండె జబ్బుల వల్ల వచ్చే మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు కేవలం కిడ్నీ నిపుణులను (nephrologists) మాత్రమే కాకుండా, క్రమం తప్పకుండా గుండె నిపుణులను (cardiologists) కూడా సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముందస్తు ప్రమాదాలను నివారించవచ్చు.
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
