పిల్లల్లో టాన్సిల్స్‌ కు పరిష్కార మార్గాలు..? 

సాక్షి లైఫ్ : పిల్లల్లని వేధించే వాటిలో టాన్సిల్స్‌ సమస్య ఒకటి. చాలామంది పిల్లలు దీనిబారినపడి పెద్దల్ని నానా ఇబ్బందులు పెడుతుంటారు. ఆఖరికి సర్జరీ చేయించి తీసేయడం జరుగుతుంది. అసలు ఎందుకొస్తుంది. దీన్ని నివారించాలంటే ఏం చేయాలి..? అనే  అంశాల గురించి ఆయుర్వేద నిపుణులు నవీన్‌ నడిమింటి తెలిపారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కొన్ని సార్లు ఇబ్బంది పెట్టినా కూడా టాన్సిల్స్ మంచివి. మనం తీసుకున్న ఆహారంలో ఉండే బాక్టీరియా లాంటి కొన్ని రకాల క్రిములను ఈ టాన్సిల్స్ అడ్డుకుంటాయి. ఒంట్లో బాగా వేడి చేస్తే ఈ టాన్సిల్స్ వాపు చేసి నొప్పిగా అనిపిస్తాయని ఆయుర్వేద నిపుణులు నవీన్‌ నడిమింటి చెబుతున్నారు. టాన్సిల్స్ రావడానికి ప్రధాన కారణం వేడి చేసే పదార్దాలు తినడం (ఫ్రిడ్జ్లో నీరు తాగడం,. కూల్ డ్రింక్స్, మసాలాలు, కారం, పచ్చళ్ళు లాంటివి అన్నమాట). వాతావరణానికి తగ్గట్లు ఆహారపు అలవాట్లలో కొంచెం మార్పు చేసుకుంటే టాన్సిల్స్ పెద్దగా ఇబ్బంది పెట్టవని ఆయన చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఒకవేళ నొప్పితో బాధపడుతుంటే డాక్టరు దగ్గరకి వెళ్లేముందు ఒక్కసారి ఇది చేసి చూడండి. రాళ్ళ ఉప్పు వేసిన వేడి నీరు గొంతు వరకు పోసుకుని పుక్కిలించండి. ఇలా రోజుకి 4 సార్లు చొప్పున 2 రోజులు చేయండి. 90శాతం వరకు నొప్పి మాయం అవుతుంది. అలానే తాగే నీరు కూడా వేడిగా ఉండేలా చూసుకోండి. అదే వృద్దులకు గొంతులో నొప్పి , కఫం తగ్గాలంటే  మెత్తగా దంచి జల్లించి న కరక్కాయ పొడి, తేనెలో కలిపి రెండు పూటలా చప్పరించాలి" అని ఆయుర్వేద నిపుణులు నవీన్‌ అంటున్నారు.

"ఉదయం లేవగానే గోరు వెచ్చని మంచినీరు రెండు గ్లాసులు త్రాగాలి.రాత్రి పడుక్కోడానికి అరగంట ముందు రెండు చిటికెల పసుపు, నాలుగు మిరియాలు ( దంచిన ముక్కలు) పంచదార కొంచెం ( షుగరు లేకపోతే ఉంటే మెత్తని ఎండు ఖర్జూరం పొడి) ఒక గ్లాసు పాలు లో మరిగించి, వడకట్టి త్రాగాలి. వృద్ధులుకి ఏది ఇచ్చినా అది ద్రవ రూపంలో లేదా మెత్తని పౌడర్ రూపంలో ఉండాలి అయినా కూడా నొప్పి తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్‌కి వెళ్లండి. టాన్సిల్స్‌కి చిన్నపాటి సర్జరీ ఉంటుంది" అని ఆయన వెల్లడించారు.

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : kids-health kids-health-care tonsils home-remedies-for-tonsils tonsils-treatment tonsils-removal tonsils-infection removal-of-adenoids-and-tonsils-in-children tonsils-home-remedy inflamed-tonsils tonsils-treatment-in-telugu tablet-for-tonsils-pain tonsils-in-jaw
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com