పిల్లలలో టైప్-2 డయాబెటీస్‌ కు ప్రధాన కారణాలు..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్: మధుమేహం ఇటీవలి కాలంలో ఇది పిల్లల్లోనూ తీవ్రంగా పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు పిల్లల్లో టైప్‌-2 మధుమేహ బాధితులు ఎక్కువ అవుతున్నారని అంటున్నారు కింగ్‌జార్జ్‌ మెడికల్‌ యూనివర్శిటీ వైద్య నిపుణులు.

ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే 

ఇది కూడా చదవండి.. ఋతు పరిశుభ్రత దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత..

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

 

‘‘మధుమేహ చికిత్స చేస్తున్న వాళ్లలో ఇప్పుడ ఏడవ తరగతి పిల్లలూ ఉంటున్నారు. ఆ కుర్రాడి కుటుంబంలో ఎవరికీ ఈ సమస్య లేదు. అయినా సరే. కుర్రాడు మాత్రం వ్యాధి బారిన పడ్డాడు’’ అని కింగ్‌గ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ  మెడిసిన్ విభాగం సీనియర్ సిబ్బంది కౌసర్ ఉస్మాన్ తెలిపారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతోందని ఉస్మాన్‌ చెబుతున్నారు.

వంశపారంపర్యంగా .. 

పిల్లల్లో టైప్‌-2 మధుమేహానికి  వంశపారంపర్య లక్షణాల కంటే ఈ కాలపు జీవనశైలే ఎక్కువ కారణమవుతోందని చెబుతున్నారు... ఎన్‌.ఎస్‌.వర్మ. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన  ఫిజియాలజీ విభాగం అధిపతి అయిన ఈయన మాట్లాడుతూ..“పిల్లలు ఇప్పుడు బయట ఆహారం ఎక్కువగా తింటున్నారు, పాఠశాలలకు ఇంట్లోంచి భోజనం తెచ్చుకోవడం లేదు" అని అన్నారు.

ఒత్తిళ్ల కారణంగా..

రకరకాల ఒత్తిళ్ల కారణంగా ఈ కాలపు తల్లిదండ్రులు వండిన ఆహారానికి బదులు డబ్బులిచ్చి బయట తినమని పిల్లలకు చెబుతున్నారు. పైగా అన్ని రంగాల్లోనూ బాగా రాణించాలన్న ఒత్తిడి కూడా పిల్లలపై పెంచుతున్నారు. చిన్నప్పటి నుంచే వైద్యం, లేదా ఇంజినీరింగ్‌ చదవాల్సిందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ పిల్లల్లో మానసిక ఒత్తిడిని పెంచేస్తున్నాయి.  

గతంలో ఈ ఒత్తిడి అనేది పదవ తరగతి పూర్తయిన తరువాతే కనిపిచేదని కానీ ఇప్పుడు నాలుగైదు తరగతుల విద్యార్థుల్లోనూ కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. " కుటుంబంలో ఎవరికీ డయాబెటిస్‌ లేకున్నా,.. పిల్లల్లో ఈ వ్యాధి కనిపిస్తోందని, 17 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులను ప్రభావితం చేస్తుంది" అని ఉస్మాన్ చెబుతున్నారు.
 
ప్రీ డయాబెటిస్.. 

ప్రొఫెసర్ వర్మ మాట్లాడుతూ.. “ ICMR డేటా ప్రకారం... ఉత్తరప్రదేశ్‌లోని జనాభాలో వయస్సుతో సంబంధం లేకుండా 18 శాతం మందికి మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ICMR అధ్యయనం ప్రకారం, వారు ప్రీ-డయాబెటిస్ విభాగంలోకి వస్తారు. వారు ఇప్పటికీ మధుమేహాన్ని నిరోధించగలరు, కానీ వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరం.'' రోజూ కనీసం 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని,ఆహారపు అలవాట్లను సమీక్షించుకుని శరీరానికి ఏది సరిపోతుందో అదే తినాలని ఆయన సూచించారు.

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.