కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? 

షేర్ చేయండి:
కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? 

సాక్షి లైఫ్ : కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు (విటమిన్ A, C, E, జింక్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్) సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినాలి. కూరగాయలు, పండ్లు, చేపలు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. డిజిటల్ యుగంలో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. డిజిటల్ స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడపడం కంటి ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపే అవకాశం ఉంది. దీనివల్ల చూపు మందగించడం, కళ్లు పొడిబారడం, అలసట వంటి అనేక సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

ఆయా సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి..? డిజిటల్ స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల కళ్లపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల దృష్టిలోపాలు తలెత్తే ప్రమాదం ఉందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. 

స్మార్ట్ ఫోన్..

స్మార్ట్ ఫోన్ ఎక్కువసేపు చూడడం వల్ల కళ్ళు పొడిబారడం, తలనొప్పి, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి.  ఈ సమస్యలను అధిగమించడానికి ప్రతి 20 నిమిషాలకు ఓసారి విరామం తీసుకోవాలి, డిజిటల్ స్క్రీన్ కు కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 

వ్యాయామం..

వ్యాయామం కంటి కండరాలను సడలిస్తుంది. కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత (యూవీ) కిరణాలు కళ్లను దెబ్బతీస్తాయి. ఎండ బాగా ఉన్నప్పుడు , మేఘావృతమైన రోజులలో బయటికి వెళ్లేటప్పుడు100శాతం UVA , UVB కిరణాలను నిరోధించే సన్ గ్లాసెస్ ధరించండి. అన్ని కోణాల నుంచి కళ్ళను రక్షించే సన్ గ్లాసెస్ ఎంచుకోవడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు.

పోషకాలు..

కంటి ఆరోగ్యం కోసం పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకోసం విటమిన్ "సి", "ఇ", ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ , లుటిన్ అధికంగా ఉండే ఆహారాన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి కంటిచూపునకు మేలు చేయడమే కాకుండా, వయసు సంబంధిత సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

తగినంత నీరు తీసుకోక పోవడం వల్ల కళ్లు పొడిబారతాయి. కెఫిన్ ,ఆల్కహాల్ పానీయాలకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే అవి డీహైడ్రేషన్ కు గురయ్యేలా చేస్తాయి. కళ్ళు , కాంటాక్ట్ లెన్స్‌లను తాకే ముందు చేతులు కడుక్కోవాలి. కాంటాక్ట్ లెన్స్ కేసును క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.   

ఇది కూడా చదవండి..స్లీప్ డిజార్డర్ సమస్యలకు సరైన పరిష్కారాలు

ఇది కూడా చదవండి..హెచ్ఐవీ, ఎయిడ్స్ ఒకటికాదా..?

ఇది కూడా చదవండి..తిప్పతీగ ఆకులు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.