చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?
సాక్షి లైఫ్ : వాస్తవానికి, పని ఒత్తిడి లేదా డిప్రెషన్ కారణంగా కొందరు వ్యక్తులలో మతిమరుపు కనిపిస్తుంటుంది. కానీ దానిని అల్జీమర్స్ వ్యాధి లక్షణాలుగా భావించలేము. అయితే వారు పూర్తిగా ఏకాగ్రతతో ఉండలేరు, అందుకే కొన్ని సందర్భాల్లో మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అందరిలో ఈ అల్జీమర్స్ రాకపోవచ్చు. కొందరికి చిన్న వయస్సులో వచ్చే అవకాశం చాలా తక్కువ. అయితే ఇది చాలా అరుదు. విటమిన్ బి12 లోపం లేదా థైరాయిడ్ అసమతుల్యత వల్ల కూడా మతిమరుపు వస్తుందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?
ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి..?
అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం సాధారణంగా 60 ఏళ్ల తర్వాత మాత్రమే ఉంటుంది. విటమిన్ B12 లేదా థైరాయిడ్ అసమతుల్యత అల్జీమర్స్ వంటి సమస్యలను కలిగిస్తుంది. బి12, థయామిన్ లోపం వల్ల మతిమరుపు వస్తుంది.
జీవనశైలి అసమతుల్యత..
అల్జీమర్స్ రావడానికి జీవనశైలి అసమతుల్యత కూడా ఒక ప్రధాన కారణం. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, తగినంత నిద్రలేకపోవడం, శారీరకంగా చురుకుగా ఉండకపోవడం, కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడి తోకూడిన జీవనశైలిని అనుసరించడం వల్ల డిమెన్షియా, అల్జీమర్స్ వ్యాధి తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
ముందు జాగ్రత్తలు..?
అల్జీమర్స్ వ్యాధి రాకుండా ఉండాలంటే..? తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. అటువంటివాటిలో కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారాలకు దూరంగా ఉండటం, ఒత్తిడి లేని జీవనశైలిని అనుసరించడం , సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం వంటి జాగ్రత్తలు పాటిస్తే డిమెన్షియా, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని కొంతమేర నివారించవచ్చు.
స్క్రీన్‌లపై నిరంతరం ఎక్కువసేపు పని చేయడం లేదా కృత్రిమ కాంతిలో ఎక్కువగా ఉండటం వల్ల నిద్రపై తీవ్ర ప్రభావం పడుతుంది, తద్వారా మానసిక ప్రశాంతత పాడవుతుంది. శరీరానికి తగిన నిద్ర ఉంటే మనసుకు విశ్రాంతి లభిస్తుంది.
ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..
ఇది కూడా చదవండి..WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.