హెచ్ఐవీ, ఎయిడ్స్ ఒకటికాదా..?
సాక్షి లైఫ్ :హెచ్ ఐవీ అనేది ఒక వైరస్.. దీనిని "హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్" అని కూడా అంటారు.హెచ్ ఐవీ రోగనిరోధక శక్తిని నాశనం చేస్తుంది. దీనికరణంగా ఇతర వ్యాధులతో పోరాడటం కష్టమవుతుంది. అందువల్ల, హెచ్ ఐవీ రోగనిరోధక శక్తిని పూర్తిగా బలహీనపరిచినప్పుడు. అది అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్ (ఎయిడ్స్)కు కారణం అవుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఎయిడ్స్ అనేది ఎవరినైనా ప్రభావితం చేసే ఒక తీవ్రమైన వ్యాధి. అయినప్పటికీ, నేటికీ దాని గురించి ప్రజలలో అవగాహన లేకపోవడం దాని ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. ఈ ప్రాణాంతక వ్యాధి గురించి అందరికీ అవగాహన తప్పనిసరిగా అవసరం. ఈ వ్యాధికి సంబంధించిన అన్ని విషయాలపై ప్రజలకు అవగాహన అవసరం.
ఎయిడ్స్ ఒక తీవ్రమైన వ్యాధి, ఇది చాలా మందికి ప్రాణాంతకం. ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడంతో ప్రజలు తరచూ తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తోంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు, తద్వారా హెచ్‌ఐవి సంక్రమణ వ్యాప్తి వల్ల కలిగే ఎయిడ్స్ మహమ్మారి గురించి అవగాహన పెంచుకోవచ్చు. అయినప్పటికీ, నేటికీ చాలా మందికి హెచ్‌ఐవి , ఎయిడ్స్ మధ్య వ్యత్యాసం తెలియదు, దీని కారణంగా వారు సరైన చికిత్స పొందలేకపోతున్నారు.
హెచ్ఐవీ అంటే..?
హెచ్ ఐవీ అనేది ఒక వైరస్.. దీనిని "హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్" అని కూడా అంటారు.హెచ్ ఐవీ రోగనిరోధక శక్తిని నాశనం చేస్తుంది. దీనికరణంగా ఇతర వ్యాధులతో పోరాడటం కష్టమవుతుంది. అందువల్ల, హెచ్ ఐవీ రోగనిరోధక శక్తిని పూర్తిగా బలహీనపరిచినప్పుడు. అది అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్ (ఎయిడ్స్)కు కారణం అవుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఎయిడ్స్ అంటే..?
AIDS అనేది HIV వల్ల కలిగే వ్యాధి. ఇది అత్యంత తీవ్రమైన దశ. ఎయిడ్స్‌తో బాధపడేవారిలో తెల్ల రక్తకణాలు చాలా తక్కువగా ఉంటాయి అంతేకాదు వారి రోగనిరోధక వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింటుంది.
HIV అండ్ AIDS మధ్య తేడా ఏమిటి..?
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం, HIV అండ్ AIDS మధ్య అతి ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే..? HIV అనేది మీ రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచే ఒకరకమైన వైరస్. అదే సమయంలో, AIDS అనేది రోగనిరోధక వ్యవస్థ తీవ్రంగా బలహీనపరిచినప్పుడు HIV సంక్రమణకు దారితీసే పరిస్థితి లేదా వ్యాధినే ఎయిడ్స్ అంటారు.
ఒక వ్యక్తి హెచ్‌ఐవి సోకినంత వరకు ఎయిడ్స్ సోకకపోవచ్చు. హెచ్‌ఐవితో బాధపడుతున్న ప్రతి వ్యక్తికి ఎయిడ్స్ రాదు, కానీ చికిత్స లేకాపోతే హెచ్‌ఐవి ఎయిడ్స్‌కు దారి తీస్తుంది.
హెచ్‌ఐవి ప్రభావం..
హెచ్‌ఐవి కొంతమందికి మాత్రమే సోకుతుందని చాలా మంది నమ్ముతారు. అయితే, ఇది ఒక అపోహ . వైరస్‌కు గురైనప్పుడు ఎవరైనా HIV బారిన పడే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
