Mother Milk : శిశువులకు పాలు ఇచ్చే తల్లుల సంఖ్య తగ్గడానికి అసలు కారణాలేంటి..?
సాక్షి లైఫ్ : మారిన జీవనశైలి, మారుతున్న సామాజిక పరిస్థితులు చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పుట్టిన ఆరు నెలల వరకు శిశువులకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలనే నియమం ఎందుకు పాటించడంలేదు అంటే..? అందుకు ప్రధానంగా కొన్ని కీలక కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇది కూడా చదవండి..Ferritin Face : 'ఫెర్రిటిన్ ఫేస్' అంటే ఏమిటి..? ఎలాంటివారికి వస్తుంది..?
ఇది కూడా చదవండి..ICMR’s New Dietary Guidelines : ఐదు నుంచి 18 ఏళ్ల వారు ఏం తినాలి..? ICMR కొత్త మార్గదర్శకాలు ఇవే..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
తల్లిపాలు తగ్గడానికి గల ప్రధాన కారణాలు..
ఉద్యోగ వాతావరణం, ప్రసూతి సెలవుల కొరత..నేటి ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో, ముఖ్యంగా ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు ప్రసవానంతరం తగినంత కాలం పాటు ప్రసూతి సెలవులు లభించడం లేదు. ఉద్యోగ బాధ్యతల ఒత్తిడి కారణంగా చాలా మంది తల్లులు అనివార్య పరిస్థితుల్లో పైపాలు ఫార్ములా మిల్క్ (formula milk) లేదా ఇతర ఆహారాన్ని చాలా త్వరగా ప్రారంభిస్తున్నారు.
ఆహారపు అలవాట్లలో మార్పులు..
గర్భధారణ సమయంలో, ఆ తర్వాత బాలింతలు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. నేటి తరం తల్లులు పోషక విలువలతో కూడిన ఇంటి భోజనానికి బదులుగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌లపై ఆధారపడు తున్నారు. దీనివల్ల తల్లి శరీరంలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపో తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెరుగుతున్న సిజేరియన్ ప్రసవాలు..
వైద్య రంగంలో మార్పులతో పాటు సిజేరియన్ (C-Section) డెలివ రీలు భారీగా పెరుగుతున్నాయి. శస్త్రచికిత్స ద్వారా ప్రసవించిన తల్లులు కోలుకోవడానికి కొంత సమయం పట్టడం, ఆ వెంటనే బిడ్డకు సరిగ్గా పాలు పట్టడంలో ఎదురవుతున్న శారీరక ఇబ్బందులు కూడా తల్లిపాలు దూరమవడానికి మరో కారణంగా మారుతున్నాయి.
తల్లిపాలే బిడ్డకు మొట్టమొదటి సహజ సిద్ధమైన వ్యాధి నిరోధక టీకా..
నవజాత శిశువులకు తల్లిపాలు కేవలం ఆకలి తీర్చే ఆహారం మాత్రమే కాదని, అదొక అత్యంత శక్తివంతమైన రక్షణ కవచమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇది బిడ్డకు లభించే మొట్టమొదటి సహజ సిద్ధమైన వ్యాధి నిరోధక టీకా (First Vaccine) లాంటిది. శిశువుల్లో అంటువ్యాధులను నివారించి, పోషకాహార లోపం (Wasting/Stunting) బారిన పడకుండా అడ్డుకోవడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే పిల్లల శారీరక, మానసిక వికాసానికి తల్లిపాలు ఎంతో బలమైన పునాది వేస్తాయి. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు, సంపూర్ణ ఆరోగ్యం కోసం మాతృమూర్తులు తప్పనిసరిగా మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలను మాత్రమే అందించాలని ఆరోగ్య నిపుణులు గట్టిగా సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
