Hearing Risk : చెవుల్లో ఈలలు, గంటలు మోగుతున్నాయా..? నిర్లక్ష్యం చేస్తే వినికిడికే ముప్పు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే మనం.. చాలాసార్లు చెవుల ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ, మనకు వినికిడి శక్తిని అందించడంతో పాటు, నడిచేటప్పుడు శరీర సమతుల్యతను (body's balance) కాపాడటంలోనూ చెవుల పాత్ర అత్యంత కీలకం. ఎప్పుడైనా మీ చెవుల్లో హఠాత్తుగా ఈల వేసినట్లు, గంటలు మోగుతున్నట్లు లేదా కీచుమనే శబ్దాలు వస్తున్నాయా..? చాలా మందిలో ఇవి కొద్ది సెకన్లలోనే తగ్గిపోతాయి. కానీ, మరికొందరిలో మాత్రం ఈ శబ్దాలు నిరంతరాయంగా వేధిస్తుంటాయి. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని 'టిన్నిటస్ (Tinnitus)' అంటారు. ప్రస్తుతం యువతలో ఇయర్‌ఫోన్స్, హెడ్‌ఫోన్స్ వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో ఈ సమస్య బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

 

ఈ సమస్య ఎందుకు వస్తుంది..?

ఈ సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా లోపలి చెవిలోని (cochlea) సున్నితమైన కణాలు దెబ్బతినడం వల్ల ఈ శబ్దాలు ఎక్కువగా వస్తుంటాయి. వీటితో పాటు మరికొన్ని కారణాలు. ఎక్కువ శబ్దాల మధ్య గడపటం, లేదా ఇయర్‌ఫోన్స్‌ను ఫుల్ వాల్యూమ్‌లో వాడటం వల్ల లోపలి చెవి దెబ్బతింటుంది. చెవిలో గుమిలి (Earwax) పేరుకుపోయి, గాలి లేదా శబ్ద తరంగాలు వెళ్లే మార్గం మూసుకుపోవడం. వయసు పైబడటం వల్ల సహజంగానే వినికిడి కణాలు బలహీనపడటం. కొన్ని రకాల మందుల వాడకం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్..

అకస్మాత్తుగా శబ్దాలు వస్తే ఏం చేయాలి..?

మీ చెవుల్లో అకస్మాత్తుగా కీచుమనే శబ్దం వస్తే, వెంటనే పెద్ద శబ్దాలున్న ప్రదేశం నుంచి దూరంగా వెళ్లాలి. ఇయర్‌ఫోన్స్ వాడుతుంటే వెంటనే తీసేయాలి. చెవిలో ఏదో అడ్డం పడిందని భావించి చాలా మంది వేళ్లు, ఇయర్‌బడ్స్, హెయిర్‌పిన్స్ పెట్టి తిప్పుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. దీనివల్ల కర్ణభేరికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. వైద్యుల సలహా తీసుకోకుండా సొంతంగా చెవిలో నూనెలు, ఇయర్ డ్రాప్స్ వంటివి అస్సలు వేయకూడదు.ఈ శబ్దాలు కొద్దిసేపట్లో తగ్గిపోతే సాధారణ సమస్యగానే భావించ వచ్చు. కానీ, రోజుల తరబడి వేధిస్తుంటే మాత్రం వెంటనే ఈఎన్టీ (ENT) స్పెషలిస్ట్‌ను సంప్రదించాలి.

ఈ లక్షణాలు ఉంటే మరింత జాగ్రత్త..!

చెవిలో శబ్దాలతో పాటు మరికొన్ని లక్షణాలు కనిపిస్తే అస్సలు విస్మరించకూడదు. ఒక లేదా రెండు చెవుల్లో అకస్మాత్తుగా వినికిడి సామర్థ్యం తగ్గిపోతే వెంటనే డాక్టర్‌ను కలవాలి. చెవి సమస్యల వల్ల శబ్దాలతో పాటు కొందరిలో తలతిరగడం (vertigo), నడిచేటప్పుడు తూలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. ఈ 'టిన్నిటస్' సమస్య దరిచేరకుండా ఉండాలంటే.. ఇయర్‌ఫోన్స్ వాడేటప్పుడు వాల్యూమ్ ఎప్పుడూ సగానికంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఫ్యాక్టరీలు లేదా ఎక్కువ శబ్దం ఉన్న ప్రదేశాల్లో పనిచేసేవారు చెవుల రక్షణ కోసం 'ఇయర్‌ప్లగ్స్' వాడటం ఉత్తమం. అలాగే చెవిలో గుమిలి ఉన్నప్పుడు సొంత ప్రయోగాలు చేయకుండా డాక్టర్ల సాయంతోనే క్లీన్ చేయించుకోవాలి.

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.