పిల్లల్లో ఏకాగ్రతను పెంచే యోగాసనాలు..
సాక్షి లైఫ్: అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024: యోగా మిమ్మల్ని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. యోగా ప్రయోజనాలను ప్రజలకు తెలియచేయడానికి, ప్రతి సంవత్సరం జూన్ 21ని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024గా జరుపుకుంటారు.
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక : ఈ ఆసనాలు యోగా గురువుల పర్యవేక్షణలోమాత్రమే వేయాల్సి ఉంటుంది..
మీరు మీ పిల్లల చదువుల గురించి ఆందోళన చెందుతున్నారా..? పదే పదే పాఠం చెప్పినా గుర్తుంచుకోలేకపోతున్నారని భావిస్తే, పిల్లలలో ఏకాగ్రతను పెంచడానికి రెండు యోగాసనాలను వారితో వేయించండి. ఇవి పిల్లల్లో ఒత్తిడిని అదుపు చేయడంతోపాటు వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచడానికి యోగాసనాలు సహాయపడుతాయి.
వృక్షాసనం..
వృక్షాసనం చేయడానికి ముందుగా యోగా మ్యాట్‌పై నిటారుగా నిలబడి, కుడి కాలు మోకాలిని వంచి, ఎడమ కాలు తొడపై కుడి పాదం అరికాలను తాకడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తున్నప్పుడు, ఎడమ కాలు మీద శరీర బరువును బ్యాలెన్స్ చేస్తూ నిటారుగా నిలబడటానికి ప్రయత్నించండి. దీని తరువాత, ఎక్కువ సేపు శ్వాస తీసుకోండి. మీ రెండు చేతులను తలపైకి తీసుకుని, నమస్కార భంగిమ చేయండి. ఇలా చేస్తున్నప్పుడు వెన్నెముక, నడుము, తల స్ట్రెయిట్ గా ఉండాలి. కొంత సమయం పాటు ఈ భంగిమలో ఉన్న తర్వాత, శ్వాస వదులుతూ, మునుపటి భంగిమలోకి రావాలి. ఇదే విధంగా 4 నుంచి 5 సార్లు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.
ప్రయోజనం..
ఈ భంగిమలో ఒక పాయింట్‌పై దృష్టి కేంద్రీకరించడం ఏకాగ్రతను పెంపొందించడానికి సహాయపడుతుంది. అంతేకాదు మానసిక స్థిరత్వం మెరుగుపడుతుంది.
బలాసనం..
బాలాసనం చేయడానికి, ముందుగా యోగా మ్యాట్‌పై మోకాళ్లను వంచి, మీ శరీర బరువు మొత్తాన్ని మడమల మీద ఉంచి, శ్వాస తీసుకుంటూ ముందుకు వంగండి. ఇలా చేస్తున్నప్పుడు, మీ ఛాతీ తొడలను తాకాలి. అప్పుడు మీ నుదిటితో నేలను తాకడానికి ప్రయత్నించండి. కొంత సమయం పాటు ఈ స్థితిలో ఉన్న తర్వాత, సాధారణ భంగిమకు తిరిగి రావాలి. ఈ ప్రక్రియ 3 నుంచి 5 సార్లు చేయవచ్చు.
ప్రయోజనం..
బాలసనం మెదడుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఏకాగ్రతను పెంచడంలో సహాయపడుతుంది.
సర్వంగాసనం..
సర్వంగాసనం కోసం, పిల్లవాడు తన తలపై నిలబడాలి. నెమ్మదిగా సాధన చేయండి. ప్రయోజనం- పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ముఖ్యంగా మెదడులో రక్త ప్రసరణను సాఫీగా జరిగేలా చేస్తుంది.
ఇది కూడా చదవండి.. గుండె జబ్బులు ఉన్నాయా..? లేదా అనేది ఎలా తెల్సుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
