Sugary Drinks : పిల్లలకు పదే పదే తీపి పానీయాలు ఇస్తున్నారా..? ఈ సమస్యలు తప్పవు..
సాక్షి లైఫ్ : పిల్లలు అడిగారని, లేక వారు ఇష్టంగా తాగుతున్నారని చాలామంది తల్లిదండ్రులు ప్యాక్ చేసిన జ్యూస్‌లు, సాఫ్ట్ డ్రింక్స్, ఫ్లేవర్డ్ మిల్క్ వంటివి ఇస్తుంటారు. అయితే, రోజూ ఇలాంటి తీపి పానీయాలు తాగడం వారి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్యాకెట్లపై 'ఫ్రూట్ జ్యూస్' లేదా 'హెల్తీ డ్రింక్' అని రాసి ఉన్నప్పటికీ, వాటిలో ఉండే అధిక చక్కెర శాతం పిల్లల దంతాలు, బరువుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
తీపి పానీయాల వల్ల కలిగే ప్రధాన నష్టాలు..
దంతాలు పుచ్చిపోవడం (cavities)..
తీపి పానీయాలు తాగినప్పుడు, అందులోని చక్కెర నోటిలోని బ్యాక్టీరియాతో కలిసి ఆమ్లాలను (acids) ఉత్పత్తి చేస్తుంది. ఇవి దంతాల పైపొరను (enamel) దెబ్బతీస్తాయి. రోజంతా కొద్దికొద్దిగా తీపి పానీయాలు తాగడం వల్ల దంతాలు త్వరగా పుచ్చిపోయే ప్రమాదం ఉంది.
బరువు పెరగడం (obesity)..
సాఫ్ట్ డ్రింక్స్, చక్కెరతో కూడిన పానీయాల ద్వారా శరీరంలోకి ఎలాంటి పోషకాలు లేని అదనపు క్యాలరీలు (empty calories) చేరుతాయి. శారీరక శ్రమ తక్కువగా ఉండే పిల్లల్లో ఇది వేగంగా అవాంఛిత బరువు పెరగడానికి కారణమవుతుంది. ప్యాకెట్లపై '100% ఫ్రూట్ జ్యూస్' అని రాసి ఉన్నప్పటికీ, వాస్తవానికి ఆ రసాల్లో పండ్లలో ఉండే పీచుపదార్థం (fiber) పూర్తిగా నశించిపోతుంది. పైగా నిల్వ ఉంచేందుకు అదనపు చక్కెరలు కలుపుతారు. కాబట్టి ప్యాకెట్‌పై ఉన్న పోషకాల వివరాలు (nutrition label) గమనించడం ఎంతో ముఖ్యం.
నీళ్లు తాగకపోవడం..
తరచూ తీపి పానీయాలకు అలవాటు పడిన పిల్లలు, ఆ రుచికి బానిసలవుతారు. దీంతో సాధారణ నీటిని లేదా తక్కువ తీపి ఉన్న పానీయాలను తాగడానికి వారు ఏమాత్రం ఆసక్తి చూపరు.
తీపి పానీయాలకు బదులుగా పిల్లలకు ఏమి ఇవ్వాలి..?
వయసుకు తగినట్లుగా, ఎలాంటి కృత్రిమ ఫ్లేవర్లు లేదా అదనపు చక్కెరలు కలపని సాధారణ పాలను ఇవ్వడం ఉత్తమం. పండ్ల రసాలు ఇవ్వడానికి బదులుగా, నేరుగా పండ్లను ముక్కలుగా కోసి తినిపించడం అలవాటు చేయాలి. దీనివల్ల శరీరానికి అవసరమైన ఫైబర్ అందుతుంది. పిల్లలకు దప్పిక వేసినప్పుడు పదే పదే జ్యూస్‌లు కాకుండా మంచినీరు తాగే అలవాటును చిన్నప్పటి నుంచే ప్రోత్సహించాలి.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
