Toilet Paper : టాయిలెట్ పేపర్ వాడుతున్నారా..? ఈ పొరపాట్ల చేయకండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రజెంట్ ఇళ్లు, ఆఫీసులు, ప్రయాణాల్లో టాయిలెట్ పేపర్ వాడకం సర్వసాధారణంగా మారింది. అయితే, దీన్ని సరైన పద్ధతిలో వాడకపోతే ఇన్ఫెక్షన్లు, ఇతర ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాయిలెట్ పేపర్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. గరుకుగా ఉండే పేపర్‌తో గట్టిగా తుడవడం వల్ల మలద్వారం చుట్టూ చర్మం కందిపోయి మంట, ఎర్రబడటం, దురద వంటి సమస్యలు వస్తాయి. సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇది మరింత ఇబ్బందికరం. పైల్స్ ఉంటే జాగ్రత్త.. ఇప్పటికే పైల్స్ (hemorrhoids) సమస్య ఉన్నవారు గట్టిగా తుడిస్తే నొప్పి, మంట మరింత తీవ్రమవుతాయి. వీరు చాలా మృదువుగా శుభ్రం చేసుకోవాలి.

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

సువాసనల పేపర్‌తో ఎలర్జీ..

 సువాసనలు (Scented), రంగులు ఉండే టాయిలెట్ పేపర్లలోని రసాయనాల వల్ల చర్మానికి ఎలర్జీలు రావచ్చు. ఎలాంటి వాసన లేని, మృదువైన సాధారణ పేపర్‌ను ఎంచుకోవడమే శ్రేయస్కరం.  కేవలం పేపర్‌తో తుడిస్తే మలం అవశేషాలు పూర్తిగా పోకపోవచ్చు. నీటితో శుభ్రం చేసుకోవడం ఉత్తమం. ఆ తర్వాత మృదువైన పేపర్‌తో గట్టిగా రుద్దకుండా.. నెమ్మదిగా అద్దుకుంటూ తడి తుడుచుకోవాలి.

మహిళలు గుర్తుంచుకోవాల్సినవి..

మహిళలు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే.. టాయిలెట్ పేపర్‌ను ఎప్పుడూ ముందు నుంచి వెనక వైపునకే (Front to back) తుడవాలి. వాష్‌రూమ్ వాడిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తీవ్రమైన దురద, నొప్పి, మంట లేదా రక్తం పడటం గమనిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.