Mindful Parenting : మైండ్‌ఫుల్ పేరెంటింగ్..పిల్లలతో ప్రశ్నలు కాదు.. భరోసాతో బంధాన్ని పెంచుకోండి..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పిల్లల పెంపకం అనగానే కేవలం వారి చదువులు, ఆహారం, అలవాట్లపై నిఘా పెట్టడమే అని చాలామంది అనుకుంటారు. కానీ, ఇవన్నీ పక్కనపెడితే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు భద్రత (security) భావాన్ని పొందడం చాలా ముఖ్యం. పిల్లల సమస్యలు తెలుసుకునే క్రమంలో తల్లిదండ్రులు పదే పదే ప్రశ్నలు సంధిస్తుంటారు. దీనివల్ల వారు తమ మనసులోని మాటలు చెప్పడానికి వెనుకడుగు వేసి, మౌనంగా ఉండిపోయే ప్రమాదం ఉంది. పిల్లలు మీతో స్వేచ్ఛగా, ఎలాంటి భయం లేకుండా మాట్లాడేలా చేయడానికి కొన్ని సులువైన 'మైండ్‌ఫుల్ పేరెంటింగ్' (Mindful Parenting) చిట్కాలు తెలుసు కుందాం..

 

ఇది కూడా చదవండి..Researchers Say Lifespan May Be Predictable : మన ఆయుష్షును అంచనా వేయవచ్చంటున్న పరిశోధకులు..

ఇది కూడా చదవండి..Dance to Burn Calories : డ్యాన్స్‌తో క్యాలరీలు బర్న్ : రోజూ 30 నిమిషాల డ్యాన్స్‌తో ఫిట్‌నెస్ మీ సొంతం..! 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

ప్రశ్నల వర్షం కురిపించొద్దు..

పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే.. 'ఈ రోజు ఏం జరిగింది..? ఎవరితో మాట్లాడావు..? టీచర్ ఏమన్నారు..?' అంటూ పోలీసుల తరహాలో విచారణ చేయకండి. వారికి కాస్త సమయం ఇవ్వండి. సాధారణ వాతావరణం కల్పిస్తే, నెమ్మదిగా వారంతట వారే తమ స్కూల్ విశేషాలను మీతో పంచుకుంటారు.

మధ్యలో అడ్డుకోకండి..

పిల్లలు ఉత్సాహంగా ఏదైనా చెబుతున్నప్పుడు మధ్యలో ఆపి మీ అభిప్రాయాలు రుద్దడం లేదా వారి తప్పులు ఎత్తిచూపడం చేయకండి. ముందు వారు చెప్పేది ఓపిగ్గా, పూర్తిగా వినండి. దీనివల్ల తమ భావాలకు, మాటలకు తల్లిదండ్రులు విలువ ఇస్తున్నారని వారు సంతోషిస్తారు.

ప్రతిదానికీ జడ్జ్ చేయకండి..

పిల్లలు పొరపాటున ఏదైనా తప్పు చేసినా, లేదా మీకు నచ్చని విషయాన్ని అమాయకంగా చెప్పినా వెంటనే అరిచేయకండి. ప్రతిదానికీ కసురుకుంటే, భయంతో వారు తమ తప్పులను దాచడం మొదలుపెడతారు. వారికి తప్పును సున్నితంగా వివరిస్తూనే, 'నువ్వు ఏ విషయమైనా మాతో ధైర్యంగా చెప్పొచ్చు' అనే భరోసా కల్పించాలి.

రోజూ కాస్త 'క్వాలిటీ టైమ్' కేటాయించండి..

పిల్లలతో గడపడానికి పెద్దపెద్ద వెకేషన్స్, ఖరీదైన ఆటలే అవసరం లేదు. కలిసి భోజనం చేయడం, సాయంత్రం కాసేపు నడవడం లేదా నిద్రపోయే ముందు ఓ పది నిమిషాలు కబుర్లు చెప్పుకోవడం లాంటివి చేయండి. ఈ చిన్నపాటి సమయం వారి మనసులోని మాటలు బయటకు తీసుకురావడానికి చక్కని వేదిక అవుతుంది.

వారి మనోభావాలను అర్థం చేసుకోండి..

పిల్లలు విచారంగా, కోపంగా లేదా ఆందోళనగా ఉన్నప్పుడు వారి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 'నీకు ఏమైంది? ఎలా ఫీల్ అవుతున్నావు?' అని ప్రేమగా అడగండి. ఇలా చేయడం వల్ల వారికి మీ మీద నమ్మకం పెరిగి ఎమోషనల్ సెక్యూరిటీ దొరుకుతుంది. మైండ్‌ఫుల్ పేరెంటింగ్ అంటే పిల్లలపై ఎప్పుడూ సీసీ కెమెరాలా నిఘా వేయడం కాదు.. వారి భావాలను గౌరవిస్తూ, వారిలో నమ్మకాన్ని నింపుతూ సరైన సమయంలో అండగా నిలవడం.. ఇంట్లో భయం లేని వాతావరణం ఉన్నప్పుడే వారు మీతో స్నేహపూర్వకంగా ఉండగలుగుతారు.

 

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..  

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.