Breaking Your Fast : ఉపవాసం విరమిస్తున్నారా..? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..!
సాక్షి లైఫ్ : ఉపవాసం చేయడం వల్ల ఆధ్యాత్మిక సంతృప్తితో పాటు ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, రోజంతా ఏమీ తినకుండా ఉండి, ఉపవాసం విరమించే సమయంలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఆకలిగా ఉందని ఒకేసారి ఎక్కువగా తినడం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఉపవాసం తర్వాత ఈ కింది ఎనిమిది విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి.
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి..Jamun Benifits : జీర్ణ సమస్యలకు సరైన దివ్యౌషధం నేరేడు పండు..
ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?
ఉపవాసం తర్వాత చేయకూడని పనులు..
దీర్ఘకాలం పాటు కడుపు ఖాళీగా ఉన్న తర్వాత ఒకేసారి కడుపునిండా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. కాబట్టి, సులభంగా అరిగే తేలికపాటి ఆహారంతోనే ఉపవాసాన్ని విరమించాలి. ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా తినడం మంచిది.
నూనె, మసాలాలు తగ్గించడం మంచిది..
ఉపవాసం ముగిసిన వెంటనే నూనెలో వేయించిన పదార్థాలు, మసాలాలు దట్టించిన వంటకాలను తినకూడదు. ఇవి కడుపులో మంట, ఎసిడిటీకి దారితీస్తాయి. కారం, మసాలాలు లేని సాత్విక ఆహారాన్ని ఎంచుకోవాలి.
వేగంగా తినేయకండి..
బాగా ఆకలిగా ఉందని ఆహారాన్ని వేగంగా లాగించేయకూడదు. నెమ్మదిగా, బాగా నమిలి మింగాలి. దీనివల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది, కడుపు ఉబ్బరం దరిచేరదు.
ద్రవపదార్థాలు ముఖ్యం..
ఉపవాసం తర్వాత చాలామంది కేవలం ఆహారంపైనే దృష్టి పెడతారు, నీళ్లు తాగడం మర్చిపోతారు. రోజంతా ద్రవాలు తీసుకోకపోవడం వల్ల కోల్పోయిన తేమను శరీరానికి తిరిగి అందించాలి. సాదా నీరు, కొబ్బరి నీళ్లు, లేదా నిమ్మరసం తగినంత తాగాలి.
తీపి పదార్థాలు మితంగా..
ఖాళీ కడుపుతో ఒకేసారి ఎక్కువ స్వీట్లు, తీపి పానీయాలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. కాబట్టి, తీపి పదార్థాల వినియోగాన్ని పరిమితం చేసుకోవడమే ఆరోగ్యకరం.
అతి చల్లని పానీయాలు వద్దు..
ఫ్రిజ్లో ఉంచిన అత్యంత చల్లటి నీరు లేదా కూల్ డ్రింక్స్ వెంటనే తాగకూడదు. ఇది కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని లేదా తాజా పండ్ల రసాలను తాగడం ఉత్తమం.
టీ, కాఫీలు తాగొద్దు..
ఉపవాసం విరమించగానే వేడి వేడి టీ లేదా కాఫీ తాగడం వల్ల ఎసిడిటీ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. ముందుగా ఏదైనా తేలికపాటి ఆహారం తీసుకుని, పుష్కలంగా నీళ్లు తాగాలి. ఆ తర్వాతే పానీయాల గురించి ఆలోచించాలి.
వెంటనే నిద్రపోకూడదు..
భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ అంటే గుండెల్లో మంట, గ్యాస్ సమస్యలు ఎదురవుతాయి. తిన్న తర్వాత కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు ఇంట్లోనే నెమ్మదిగా నడవడం అలవాటు చేసుకోవాలి.
ఉపవాసం విరమించడానికి సరైన మార్గం ఇదీ..
ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీరు, కొబ్బరి నీళ్లు లేదా తాజా పండ్లతో ఉపవాసాన్ని ముగించాలి. ఆ తర్వాత కొద్దిసేపటికి మీ సాధారణ భోజనాన్ని మితంగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరం ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకుంటుంది. కడుపుపై ఆకస్మిక ఒత్తిడి పడకుండా జీర్ణవ్యవస్థ సాఫీగా పనిచేస్తుంది.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
