Mental Health: సంతృప్తి, సంతోషం ఎందుకు తగ్గుతున్నాయి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మనుషులు క్షణం తీరిక లేకుండా పనుల్లో మునిగిపోతున్నారు. ఎంత బిజీగా ఉంటే అంత గొప్పగా భావిస్తున్నారు. కానీ దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, భయం వంటివి పెరుగుతున్నాయి. కనీసం ప్రశాంతంగా కూర్చుని తినడానికి కూడా సమయం లేకుండా పోయింది. ఈ బిజీ లైఫ్ వల్ల మనం ఆరోగ్యాన్ని కోల్పోతున్నామని సైకాలజిస్టులు చెబుతున్నారు.

 ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

 ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

మానసిక ఆరోగ్యంపై ప్రభావం..  

ప్రతి పనిలోనూ తొందరపాటు మనకు సమయం ఆదా చేస్తుందని అనిపించవచ్చు. కానీ ఇదే తొందరపాటు నెమ్మదిగా మనల్ని బర్నౌట్, డిప్రెషన్ వంటి వాటికి గురిచేస్తుంది. పనుల ఒత్తిడిలో సరైన ఆహారం తినడం మానేస్తున్నారు. ఇంటి భోజనం బదులుగా ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. తొందరగా ఏదో ఒకటి తినేసి పనిచేసుకోవడం అలవాటైపోయింది. ఇది శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మనల్ని అనారోగ్యానికి గురిచేస్తుంది.  


మన పేగుల్లో సెరటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేసే చిన్న కణాలు ఉంటాయి. ఈ హార్మోన్ మనలో సంతృప్తి, సంతోషాన్ని పెంచుతుంది. పేగులు ఆరోగ్యంగా ఉంటే, ఈ సెరటోనిన్ హార్మోన్ కూడా సమతుల్యంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం కోసం వాడే మందుల్లో కూడా సెరటోనిన్ స్థాయిని పెంచడంపై దృష్టి పెడతారు. మనం నూనె, మసాలా, ఉప్పు, చక్కెర ఎక్కువగా తింటే, పేగుల్లో ఉండే సెరటోనిన్ ఉత్పత్తి చేసే కణాలు దెబ్బతింటాయి.

ఆహారానికి, మనసుకు సంబంధం.. 

మంచి ఆహారం లేకపోతే ఒత్తిడి త్వరగా పెరుగుతుంది. అలాంటి వాళ్ళు చిన్న విషయానికి కూడా ఎక్కువగా బాధపడతారు. దీనివల్ల కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇది మధుమేహం, అధిక రక్తపోటు వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

సంతోషాన్ని పెంచే ఎండార్ఫిన్..  

జాగింగ్, స్విమ్మింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయండి. ఇవి మనలో సంతోషాన్ని పెంచే ఎండార్ఫిన్ అనే హార్మోన్‌ను సహజంగా పెంచుతాయి. ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిని తగ్గించడానికి తగినంత నిద్ర అవసరం. అలాగే మంచి ఆహారం కూడా తీసుకోవాలి. ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తే, నిటారుగా కూర్చుని మీ పైభాగాన్ని సాగదీయండి. ఈ స్థితిలో రెండు నిమిషాలు ఉండి, ఆ తర్వాత నెమ్మదిగా ఊపిరి వదలండి. ఇది ఒత్తిడిని 60 శాతం వరకు తగ్గించడంలో సహాయపడుతుంది.

 

ఇది కూడా చదవండి.. లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.