అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసిడి)ప్రాణాంతకమైనదా..? లక్షణాలు ఎలా ఉంటాయి..?

సాక్షి లైఫ్ : అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసిడి) ప్రస్తుతం తీవ్ర సమస్యగా మారుతున్న ఒక రకమైన మానసిక రుగ్మత. పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు మన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అటువంటివాటిలో ఇదొకటి. ఓసిడి లక్షణాలు : జీవనశైలి అలవాట్లు, శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఆహారపు అలవాట్లు, జీవనశైలి కూడా జీవితాలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. వివిధ అంశాలతోపాటు, పెరుగుతున్న పని ఒత్తిడి మానసిక ఆరోగ్యంపై గణనీయంగా ప్రభావం చూపుతున్నాయి. బిజీ బిజీ లైఫ్ కారణంగా, ప్రజలు వివిధ మానసిక రుగ్మతలకు గురవుతున్నారు.

 ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

తరచుగా, సరైన వైద్య పరీక్షలు చేయించు కోకపోవడం వల్ల, ఈ రుగ్మతలు తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి. అలాంటి పరిస్థితినే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్(ఓసిడి), ఇటీవల కాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న మానసిక రుగ్మత.

ఇటీవల సమాజంలో ఆత్మహత్యలు పెరుగుతున్ననేపథ్యంలో మానసిక ఆరోగ్యం గురించి చర్చను మరోసారి రేకెత్తించింది. ఆత్మహత్య చేసుకున్న కొందరు విద్యార్థులలో కొంతమంది చాలా కాలంగా అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ తో బాధపడుతున్నట్లు సైకాలజిస్టులు చెబుతున్నారు. ఒక్కోసారి కొందరిలో ఓసిడి సమస్య ప్రాణాంతకం కావచ్చని, ఆయా లక్షణాలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయట పడొచ్చని వారు చెబుతున్నారు. 

అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ అంటే ఏమిటి..?

ఓసిడి అనేది ఒక రకమైన మానసిక అనారోగ్య సమస్య. దీని కారణంగా బాధితులు పదే పదే ఒకే ఆలోచనలను కలిగి ఉంటారు. ఒకే విషయాన్ని పదే పదే ఆలోచించడం అర్థరహితమని బాధితుడు అర్థం చేసుకున్నప్పటికీ, వారు అలా చేయకుండా తమను తాము కంట్రోల్ చేసుకోలేరు. బలవంతపు ఆలోచనలతో బాధపడుతున్న వ్యక్తులలో  సాధారణంగా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య కౌమారదశలో ఉన్నవారిలో, యువకులలో సర్వసాధారణం. అధికంగా శుభ్రపరచడం, వస్తువులను లెక్కించడం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటి కొన్ని ప్రధాన లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది.

ఓసిడి లక్షణాలు..  

ఓసిడితో బాధపడుతున్నవారు తరచుగా ఒకేరకమైన ఆలోచనలను పదే పదే కలిగి ఉంటారు. ఈ సమస్య నిరాశ లేదా ఆందోళనకు దారితీస్తుంది. నిద్రలేమి కూడా ఓసిడి లక్షణాల్లో ఒకటి కావచ్చు. ఓసిడితో బాధపడుతున్న వాళ్లు తరచుగా తమను తాము లేదా ఇతరులను బాధపెట్టడం గురించి ఆందోళన చెందుతాడు. పదే పదే రెప్పవేయడం, శ్వాస తీసుకోవడం లేదా ఇతర కార్యకలాపాలలో మార్పులు కనిపించడం. పదే పదే వస్తువులను లెక్కించడం. గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఉంచడం, తలుపు తెరిచి ఉంచడం లేదా తలుపు మూసివేయడం వంటి వాటి గురించి నిరంతరం ఆందోళన చెందడం.

 

ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..! 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : stress suicide ocd-symptoms-in-telugu is-ocd-life-threatening obsessive-compulsive-disorder ocd-treatment-in-india causes-and-effects-of-ocd ocd-and-suicide-risk suicide-risk
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com