మీన్ వరల్డ్ సిండ్రోమ్ అంటే..?

సాక్షి లైఫ్ : మీన్ వరల్డ్ సిండ్రోమ్: ప్రతిరోజూ వార్తాపత్రికలు క్రైమ్ వార్తలతో నిండిపోతున్నాయి. ఎక్కడో హత్య, మరెక్కడో దోపిడీ, ఇంకెక్కడో దొంగతనం. ఇలాంటి క్రైం వార్తలు ఎక్కువగా జనాల దృష్టిని ఆకర్షిస్తాయి. అంతేకాదు చాలా కాలం పాటు మనస్సులో అలా ఉండి పోతాయి.ముఖ్యంగా సామూహిక హత్య వంటి వార్తలు. వీటికి సంబంధించి మీడియాలో కొత్త విషయాలు వెల్లువెత్తడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంటుంది. మీడియాలో నేర వార్తలను ఎక్కువగా చూడటం మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. మీడియాలో నిజమైన, ఊహాత్మక నేరాలు, హింసకు సంబంధించిన వార్తలను ఎక్కువగా చూడటం లేదా చదవడం వల్ల "మీన్ వరల్డ్ సిండ్రోమ్" ప్రమాదం పెరుగుతుంది. 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

మీన్ వరల్డ్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?

"మీన్ వరల్డ్ సిండ్రోమ్" అనేది నేర వార్తలు ఎక్కువగా చూడడం, చదవడం ద్వారా మనస్సుపై ఓ రకమైన చెడు ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితినే "మీన్ వరల్డ్ సిండ్రోమ్" గాభావిస్తారు. ఇది మనస్సుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది, ఎందుకంటే మనస్సు ఆ నేర దృశ్యంపై స్థిరపడుతుంది.  దానిని ఎక్కువగా చూడాలని కోరుకుంటుంది. ఇలాంటి క్రైమ్ ఇన్సిడెంట్స్‌లో హంతకుడి కదలికలు, సంఘటనలు, వ్యూహాలలో మనస్సు చిక్కుకుపోతుంది. తనను తాను డిటెక్టివ్‌గా భావించి నేరాన్ని ఊహించడం ప్రారంభిస్తుంది. అలాంటి వారు క్రైమ్ డాక్యుమెంటరీలు, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పాటు అలాంటి వార్తలను చాలా ఆసక్తిగా చదువుతారు, చూస్తారు. 

ఈ సిండ్రోమ్ ఎందుకు ప్రమాదకరం..?

ఈ మానసిక పరిస్థితి ప్రభావం వల్ల మనిషి సమాజంతో వింతగా ప్రవర్తించడం మొదలవుతుందని వైద్యులు చెబుతున్నారు. అతను చాలా భయంకరమైన నేర ప్రపంచంతో కనెక్ట్ అవ్వడం వల్ల అతను ప్రతిచోటా భయపడుతుంటాడు. అంతేకాదు అతను ప్రతి వ్యక్తిని అనుమానిస్తాడు, ప్రతి మూలలో చీకటిని చూస్తాడు, ఎవరినైనా నేరస్థుడిగా పరిగణిస్తూ ఉంటాడు.

దీని వల్ల మనిషి మనసులో అనవసరమైన భయం, ఆందోళన, నిస్పృహలు తలెత్తి క్రమంగా సమాజానికి దూరమవుతూంటాడు. కొన్నిసార్లు అలాంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉంటారు.  వారి కుటుంబంతో కూడా వింతగా ప్రవర్తిస్తారు. 1990 తర్వాత టీవీల్లో ఫాంటసీ క్రైమ్‌లను చూపించే ట్రెండ్ పెరిగిపోయిందని, వరల్డ్ సిండ్రోమ్ బారీన పడే వారి సంఖ్య మరింతగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ డిసీజ్ లక్షణాలు ఎలా వుంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health mental-tensions mental-problems mental-issues mean-world-syndrome mean-world-syndrome-symptoms crime-news murder robbery

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com