Naturally : ఓజెంపిక్ ప్రభావాన్ని చూపించే 5 అద్భుతమైన మొక్కల ఆధారిత ఆహారాలు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : బరువు తగ్గడానికి (Weight Loss), టైప్ 2 మధుమేహం (Type 2 Diabetes) నియంత్రణకు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఓజెంపిక్ (Ozempic) అనే ఇంజెక్టబుల్ ఔషధం సెమాగ్లుటైడ్ బాగా ప్రాచుర్యం పొందింది. ఇది ఆకలిని తగ్గించి, జీర్ణక్రియను నెమ్మదింపజేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే, ఈ ఖరీదైన ఇంజెక్షన్ దుష్ప్రభావాలు, దీర్ఘకాలిక భద్రత గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో, దీనికి సహజమైన ప్రత్యామ్నాయాలు (Natural Alternatives) ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

 

ఓజెంపిక్ మాదిరిగానే ఆకలిని అణచివేసి (Appetite Suppressing), రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించే శక్తి మొక్కల ఆధారిత ఆహారాలలో (Plant-Based Foods) ఉందని వెల్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు.ఆ ఐదు అద్భుతమైన మొక్కల ఆధారిత ఆహారాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..  

 అధిక మొత్తంలో పీచు (ఫైబర్), ప్రొటీన్ (Protein)ఆరోగ్యకరమైన కొవ్వులను (Healthy Fats) కలిగి ఉంటాయి. ఇవి GLP-1 (గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్-1) అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచడంలో లేదా కడుపు నిండిన అనుభూతిని కలిగించడంలో సహాయపడతాయి. 

ఓజెంపిక్ ప్రభావం.. ఓట్స్, బార్లీవీటిలో బీటా-గ్లూకాన్ (Beta-Glucan) అనే కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేసి, ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. ఈ ఫైబర్ గట్‌లోని మంచి బ్యాక్టీరియాను ఉత్తేజపరచి, ఆకలిని అణచివేసే GLP-1 హార్మోన్ విడుదలను సహజంగా పెంచుతుంది. 

 పప్పులు, చిక్కుళ్ళు.. శనగలు, రాజ్మా, కంది పప్పు, పెసలు వంటి పప్పుల్లో ప్రోటీన్, ఫైబర్ అత్యధికంగా ఉంటాయి. ఈ రెండూ కలిసి జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి, తృప్తిని పెంచుతాయి. దీంతో భోజనం తర్వాత చక్కెర స్థాయిలు నెమ్మదిగా విడుదల అవుతాయి. ఇది డయాబెటిస్ నియంత్రణకు ఎంతో మేలు.

చియా ,అవిసె గింజలలో కరిగే ఫైబర్ విపరీతంగా ఉంటుంది. నీటిలో నానబెట్టినప్పుడు ఇవి జెల్ లాంటి పదార్థంగా మారతాయి. ఇది కడుపులో ఉబ్బి, ఆహారం జీర్ణం అయ్యే వేగాన్ని (Gastric Emptying) తగ్గిస్తుంది. ఇది ఓజెంపిక్ చేసే పనిని పోలి ఉంటుంది. 

అవకాడోలో ఉండే మోనో-అన్‌శాచురేటెడ్ కొవ్వులు (MUFA)ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. అవకాడో తినడం వల్ల కూడా GLP-1 స్థాయిలు పెరిగి, ఆకలి తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

చిరుధాన్యాలుజొన్నలు, రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (Low GI) కలిగి ఉంటాయి. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతూ స్థిరమైన శక్తిని అందిస్తాయి. తద్వారా ఆకలిని నియంత్రించి, అనవసరమైన చిరుతిళ్లు తినాలనే కోరికను తగ్గిస్తాయి. 

ఐతే ఇవి మందులకు ప్రత్యామ్నాయం కాదు..ఈ ఆహార పదార్థాలు సహజంగా ఆకలిని నియంత్రించడానికి, రక్తంలో చక్కెరను స్థిరీకరించడానికి అద్భుతంగా పనిచేస్తాయి అనడంలో సందేహం లేదు. అయితే, ఇవి ఓజెంపిక్ వంటి ప్రిస్క్రిప్షన్ ఔషధాలకు ప్రత్యామ్నాయం కావు అని గుర్తుంచుకోవాలి.  

 

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.