Walker : వాకర్ సహాయంతో నడవడం నిజంగా మంచిదేనా..?
సాక్షి లైఫ్ : చిన్నారులు వాకర్ ఉపయోగించి నడవడం నిజంగా మంచిదేనా..? వాకర్ తో నడిస్తే పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుందా..? బేబీ వాకర్స్ పిల్లలు త్వరగా నడవడానికి నిజంగా సహాయ పడకపోవచ్చు. సాధారణంగా నడవడం మొదలుపెట్టిన చిన్నారులు వాకర్ సహాయంతో నడిస్తే నడక ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఎలాంటి సహాయం లేకుండా సహజంగా నడవడం వల్ల కాళ్ళలోని కండరాలు మరింత దృఢంగా మారుతాయి.
ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
అంతేకాదు ఒకటి, రెండు సార్లు కిందపడినా మొదట భయంగా అనిపిస్తుంది. ఆ తర్వాత సులువుగా తనకు తానే పడిలేచి నడుస్తూ ఉంటారు పిల్లలు. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. తమ బిడ్డ బుడి బుడి అడుగులు వేస్తూ ఉంటే ప్రతి తల్లి ఎంతో సంతోషిస్తుంది. నడక నేర్చుకునే సమయంలో చిన్నారులకు బేబీ వాకర్స్ ఎంత మేర ఉపయోగపడుతాయి..? కొంతమంది తల్లులు తమ పిల్లలు సరిగా నడవకాపోతే ఆందోళన చెందుతుంటారు. పిల్లలు తొందరగా నడవడానికి కొన్నిరకాల చిట్కాలు పాటిస్తుంటారు. అప్పుడే పిల్లలు చాలా త్వరగా నడుస్తారు.
పిల్లలు నడవడం మొదలుపెట్టినప్పుడు తల్లులు సహజంగానే భయపడతారు. ఆ పరిస్థితిలో చాలా మంది తల్లులు చేసే ఒక పని తమ పిల్లలకు వాకర్ సహాయంతో నడవడం నేర్పించడం. పిల్లలు వాకర్ సహాయంతో నడిస్తే తనకుతానుగా నడవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పిల్లలకు వాకర్‌లో నడవడానికి శిక్షణ ఇవ్వకండి. నేలపై కూర్చుని ఎక్కువసేపు ఆడటానికి అవకాశం ఇవ్వడం వల్ల పిల్లలు నడవడం త్వరగా నేర్చుకుంటారు. అంతేకాదు పిల్లలు ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఒకవేళ పిల్లలు ఒక సంవత్సరం తర్వాత నడవకపోతే తప్పకుండా పిల్లల వైద్యనిపుణులను సంప్రదించండి.
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
