సాక్షి లైఫ్ : టీకాలు చిన్నారులకు నెలలు, సంవత్సరాలు నిండకముందే వయసును బట్టి ఎప్పటికప్పుడు ఇవ్వాలని వైద్యనిపుణులు వెల్లడి స్తున్నారు. అందుకోసం ముఖ్యంగా టీకా షెడ్యూల్ ను తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. వయసుల వారీగా భారత ప్రభుత్వ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ (UIP) కింద పిల్లలకు తప్పనిసరిగా వేయాల్సిన టీకాల జాబితా అనేది ఒకటి ఉంది. అలాంటి టీకాలను వయస్సుల వారీగా ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని జాతీయ రోగనిరోధకత షెడ్యూల్ అంటారు. దయచేసి ఖచ్చితమైన వివరాల కోసం పిల్లలవైద్యులని సంప్రదించాలి.