Risk of Stroke : రోజుకు 8వేల అడుగులు వేస్తే.. స్ట్రోక్ ముప్పు తప్పుతుందా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రోజూ 8వేల అడుగులు నడవడం వల్ల శరీరం ఫిట్‌గా ఉండటంతో పాటు గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయని చాలామంది భావిస్తుంటారు. అయితే, పక్షవాతం (brain stroke) ముప్పును తగ్గించుకోవడానికి కేవలం ప్రతిరోజూ ఇన్ని అడుగులు నడిస్తే సరిపోతుందా..? అంటే, 'సరిపోదు' అంటున్నారు వైద్య నిపుణులు. శారీరక శ్రమతో పాటు మరికొన్ని ఆరోగ్య, జీవనశైలి మార్పులు పాటిస్తేనే పక్షవాతం నుంచి రక్షణ లభిస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

సమగ్ర రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

రక్తపోటు (bp) కంట్రోల్.. స్ట్రోక్‌కు దారితీసే అతిపెద్ద కారణాల్లో హైపర్‌టెన్షన్ (bp) ఒకటి. ఇది అదుపులో లేకపోతే రక్తనాళాలు దెబ్బతింటాయి. దీనివల్ల మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయి (ischemic stroke) లేదా రక్తనాళాలు చిట్లిపోయి (hemorrhagic stroke) పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది.

షుగర్, కొలెస్ట్రాల్ అదుపు..

రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడూ ఎక్కువగా ఉన్నా రక్తనాళాలు దెబ్బతింటాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరిగితే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి మెదడుకు రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు పరీక్షించుకుని అదుపులో ఉంచుకోవాలి.

ఆహార నియమాలు.. 

నడక ఎంత ముఖ్యమో, మనం తినే ఆహారం కూడా అంతే ముఖ్యం. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

నిద్ర, మానసిక ఒత్తిడి..

 పెద్దలకు రోజుకు 7 నుంచి 9 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. నిద్రలేమి, స్లీప్ ఆప్నియా (నిద్రలో విపరీతమైన గురక, శ్వాసకు ఇబ్బంది పడటం) వల్ల బీపీ పెరిగి స్ట్రోక్ ముప్పు పొంచి ఉంటుంది. అలాగే ధ్యానం, యోగాలాంటి వాటితో ఒత్తిడిని తగ్గించుకోవాలి.

స్క్రీన్ టైమ్ తగ్గించాలి..

ఎక్కువసేపు గ్యాడ్జెట్స్ చూస్తూ ఒకేచోట కూర్చోవడం వల్ల శరీరానికి శ్రమ ఉండదు. మధ్యమధ్యలో విరామం తీసుకుంటూ అటూఇటూ నడుస్తుండాలి.

నడక ఒక్కటే సరిపోదు..

రోజుకు 8వేల అడుగులు నడవడం అనేది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, అది స్ట్రోక్ రాకుండా 100శాతం అడ్డుకుంటుందని చెప్పలేము. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం, బరువును అదుపులో ఉంచుకోవడం వంటి సమగ్ర జాగ్రత్తలతోనే మెదడుకు సంపూర్ణ రక్షణ దొరుకుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.