Proper Sleep : కంటినిండా నిద్ర లేకపోతే.. బరువు పెరుగుతారా..?
సాక్షి లైఫ్ : బరువు తగ్గాలని రకరకాల డైట్లు ఫాలో అవుతుంటాం. జిమ్‌లలో చెమటోడ్చుతుంటాం. కానీ కంటినిండా నిద్రపోవడాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటాం. రోజుకు తగినంత నిద్ర లేకపోతే మీరు ఎంత కష్టపడినా ఫలితం శూన్యమే. రాత్రిళ్లు నిద్రలేమి లేదా ఆలస్యంగా పడుకోవడం వల్ల మన శరీరంలోని జీవక్రియలు దెబ్బతిని వేగంగా బరువు పెరిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి మన శరీర బరువుపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
హార్మోన్ల అసమతుల్యతతో ఆకలి..
నిద్ర తక్కువైతే శరీరంలో ఆకలిని ప్రేరేపించే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా ఆకలిని పెంచే 'గ్రెలిన్' (Ghrelin), కడుపు నిండిన భావన కలిగించే 'లెప్టిన్' (Leptin) హార్మోన్ల పనితీరులో మార్పులొస్తాయి. ఫలితంగా ఆకలి పెరిగిపోయి, అవసరానికి మించి ఆహారం తీసుకుంటారు.
క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారంపై మక్కువ..
నిద్ర సరిగా లేనప్పుడు శరీరం అలసిపోయి, తక్షణ శక్తిని కోరుకుంటుంది. ఈ క్రమంలో క్యాలరీలు, కొవ్వులు, చక్కెరలు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్, స్వీట్లపై మక్కువ పెరుగుతుంది. ఇది నేరుగా బరువు పెరగడానికి దారితీస్తుంది.
జీవక్రియ తగ్గడం..
నిద్రలేమి కారణంగా రక్తంలో గ్లూకోజ్ వినియోగం, ఇన్సులిన్ పనితీరు దెబ్బతింటాయి. దీర్ఘకాలం పాటు నిద్రలేమి సమస్యతో బాధపడేవారిలో జీవక్రియలు మందగించి ఊబకాయం లేదా మధుమేహం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అర్ధరాత్రి వేళ చిరుతిళ్లు..
రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉండటం వల్ల ఏదైనా తినాలనే కోరిక కలుగుతుంది. దీంతో అర్ధరాత్రి వేళ స్నాక్స్ తినడం అలవాటుగా మారుతుంది. దీనికి తోడు నిద్రలేమి వల్ల కలిగే అలసట మరుసటి రోజు వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయనివ్వదు. తీసుకున్న క్యాలరీలు ఖర్చుకాక కొవ్వుగా పేరుకుపోతాయి.
నిద్ర కూడా ముఖ్యమే..
ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయాలంటే కేవలం మంచి ఆహారం, వ్యాయామం మాత్రమే సరిపోవు. రోజుకు 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర, ఒత్తిడి లేని జీవనశైలి చాలా అవసరం. అందుకే ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా, నిద్రలేచేలా అలవాటు చేసుకోవాలి. బరువు పెరగడానికి నిద్రలేమి మాత్రమే ఏకైక కారణం కాదు. తీసుకునే ఆహారం, వయసు, జన్యుపరమైన కారణాలు, వాడే మందులు, ఇతర అనారోగ్య సమస్యలు కూడా కారణం కావొచ్చు. దీర్ఘకాలికంగా నిద్రపట్టకపోవడం లేదా వేగంగా బరువు పెరుగుతుంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
