Brain Stroke : స్పృహ తప్పడం నుంచి చూపు మందగించడం వరకు.. బ్రెయిన్ స్ట్రోక్ ముందస్తు హెచ్చరికలేనా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : క్షణాల్లో కళ్లముందు చీకట్లు కమ్ముకోవడం, ఉన్నట్టుండి మాట తడబడటం లేదా చేతులు, కాళ్లలో స్పర్శ తగ్గడం వంటి సమస్యలను చాలామంది అలసటగానో, బలహీనతగానో భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఇవి మెదడుకు తీవ్ర ముప్పు పొంచి ఉందనడానికి హెచ్చరికలు కావచ్చని న్యూరాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడమే కాకుండా శాశ్వత పక్షవాతం బారిన పడకుండా ఉండవచ్చు. అసలు స్ట్రోక్ ఎందుకు వస్తుంది..? దాని ముందస్తు సంకేతాలేమిటి..? అత్యవసర సమయాల్లో ఏం చేయాలో చూద్దాం..!

మెదడుకు రక్తప్రసరణ ఆగితేనే ప్రమాదం..

మెదడులోని కణజాలానికి రక్తప్రసరణ ఆగిపోయినప్పుడు లేదా రక్తనాళం చిట్లిపోయినప్పుడు మెదడు కణాలకు ప్రాణవాయువు అందక అవి నిమిషాల వ్యవధిలోనే నశించిపోతాయి. దీన్నే బ్రెయిన్ స్ట్రోక్ (brain stroke) అంటారు. రక్త ప్రసరణ తగ్గడం..డీహైడ్రేషన్, రక్తపోటు (bp) అకస్మాత్తుగా పడిపోవడం లేదా రక్తంలో చక్కెర స్థాయిలు తీవ్రంగా తగ్గడం (hypoglycemia) వల్ల కూడా అప్పుడప్పుడు తాత్కాలికంగా స్పృహ తప్పవచ్చు (blackout). కానీ ఇది పదేపదే జరుగుతుంటే ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదు.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

చూపులో ఆకస్మిక మార్పులు..

 ఒక కన్ను లేదా రెండు కళ్లలో అకస్మాత్తుగా చూపు మందగించడం, మసకబారడం, రెండేసిగా కనిపించడం (double vision) వంటివి రక్తనాళాలు లేదా మెదడు నాడీ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు కనిపిస్తాయి. చూపు సమస్యతో పాటు శరీరం తూలడం, తలతిరగడం ఉంటే వెంటనే అప్రమత్తం కావాలి.

‘ఫాస్ట్’ (FAST) సూత్రంతో క్షణాల్లో స్ట్రోక్ గుర్తింపు..!

స్ట్రోక్ లక్షణాలను వేగంగా కనిపెట్టేందుకు వైద్య నిపుణులు FAST అనే సాధారణ ఫార్ములాను సూచిస్తున్నారు.

F - Face (ముఖం).. నవ్వమని చెప్పినప్పుడు ముఖం ఒకవైపునకు వంకరపోవడం లేదా పెదవి మూల కిందికి జారడం.

A - Arm (చేయి)..రెండు చేతులను పైకి ఎత్తమని చెప్పినప్పుడు ఒక చేయి పైకి లేవకపోవడం లేదా కిందకు జారిపోవడం (weakness).

S - Speech (మాట)..మాట్లాడేటప్పుడు మాట ముద్దగా రావడం, మాటలో తడబాటు లేదా ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం.

T - Time (సమయం): పై మూడు లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా ఆలస్యం చేయకుండా తక్షణమే అత్యవసర చికిత్స (emergency medical care) అందించేందుకు సమీపంలోని స్ట్రోక్ సదుపాయాలున్న ఆసుపత్రికి తరలించాలి.

తక్షణమే ఎప్పుడు ఆసుపత్రికి వెళ్లాలి..?

శరీరంలో ఒకవైపు భాగం (face, arm, or leg) అకస్మాత్తుగా మొద్దుబారడం లేదా చచ్చుబడిపోవడం.

కారణం లేకుండా తీవ్రమైన తలనొప్పి రావడం.

నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పడం, కళ్లు తిరగడం.

మాటలు స్పష్టంగా రాకపోవడం, స్పృహ కోల్పోవడం.

గోల్డెన్ అవర్ కీలకం..స్ట్రోక్ లక్షణాలు మొదలైన మొదటి 4.5 గంటల కాలాన్ని ‘గోల్డెన్ అవర్’గా పరిగణిస్తారు. ఈ సమయంలో రోగిని సరైన చికిత్సా వసతులున్న ఆసుపత్రికి చేరిస్తే, మెదడులో ఏర్పడిన రక్తపు గడ్డలను కరిగించే ఆధునిక చికిత్సల ద్వారా నష్టాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించవచ్చు. లక్షణాలను గమనించిన క్షణమే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.