తరచుగా ఏడుపు లేదా కోపం పిల్లలలో ఒత్తిడికి సంకేతాలేనా..?  

సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండటానికి, మంచి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందు కోసం ఏమి చేయాలి..? ఏమి చేయకూడదు..? పిల్లల్లో పెరుగుతున్న ఒత్తిడి పెరిగితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..? వాటిని ఎలా గుర్తించవచ్చు..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ఒత్తిడి అనేది ఒక మానసిక సమస్య, ఇది ఎవరినైనా బాధితుడిని చేస్తుంది.
ప్రస్తుతం పెద్దలే కాదు పిల్లలు కూడా దీని బాధితులుగా మారుతున్నారు. అటువంటి పరిస్థితిలో, కొన్ని లక్షణాల సహాయంతో సకాలంలో గుర్తించవచ్చు.

ఇది కూడా చదవండి..అపోహలు- వాస్తవాలు : బ్లడ్ క్యాన్సర్ వస్తే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందేనా..?

ఇది కూడా చదవండి..మధుమేహం వచ్చేముందు కనిపించే లక్షణాలు..

ఇది కూడా చదవండి..చేతులు కడుక్కునేటప్పుడు ఎలాంటి సబ్బు వాడాలి..?

 
ప్రతి వ్యక్తి జీవితంలో బాల్యం అత్యంత అందమైన, మరపురాని సమయం. చిన్ననాటి రోజులు గుర్తొస్తే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. అయితే, ఈ బాల్యంలో ఏదైనా ముద్ర పడితే జీవితాంతం మనస్సులో ఉంటుంది. మారుతున్న కాలంతో పాటు నేటి పిల్లల బాల్యం కూడా మారిపోయింది. ఒక వైపు, వేగంగా మారుతున్న సాంకేతికత, ఆలోచన ప్రయోజనాలు ఉన్నాయి, కానీ అదే సమయంలో అనేక నష్టాలు కూడా ఉన్నాయి. పిల్లలు మునుపటిలా ప్రకృతితో సమయం గడపడంలేదు, పుస్తకాలు చదవడంలేదు. సామాజికంలో కలిసి మెలిసి ఉండడడంలేదు. 

ఇవన్నీ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. రోజంతా స్క్రీన్ ముందు గడపడం వల్ల పిల్లలు ఒత్తిడికి గురవుతారు. మారుతున్న కాలంలో పిల్లలు కూడా ఒత్తిడికి గురవుతున్నారు. గత కొంతకాలంగా పిల్లల్లో ఒత్తిడి అనేది పిల్లల్లో కూడా సాధారణ సమస్యగా మారుతోంది. 

  సెన్సిటివ్ గా.. 

ఒత్తిడితో బాధపడుతున్న పిల్లలు ఎప్పుడూ ఏడుపు, విచారం వంటి  అనుభూతుల మధ్య నలిగిపోతారు. చిన్న విషయాలకు కూడా ఏడుస్తుంటారు.

కోపం-చిరాకు.. 

ఒత్తిడిలో ఉన్నప్పుడు, పిల్లలు తమ భావాలను వ్యక్తపరచలేక, అనవస రంగా అరుస్తూ తమ మనసులోని గందరగోళాన్ని వ్యక్తం చేస్తారు. వారికి కోపం కూడా వస్తుంది.

శ్రద్ధ కోసం.. 
  
ఒత్తిడితో బాధపడుతున్న పిల్లలు అభద్రతాభావంతో జీవిస్తారు. ఏడవడం లేదా అరవడం ద్వారా వారు అందరి దృష్టిని ఆకర్షిస్తారు. పుట్టినరోజు పార్టీకి వెళ్లినా లేదా అందరిలో కలవడానికి వెనకడుతుంటారు. కుటుంబం, స్నేహితులు లేదా ఉపాధ్యాయులు ఎవరితోనైనా బహిరంగంగా మాట్లాడటానికి సంకోచిస్తారు.

భయం.. 

 భయాలు ఎక్కువగా ఉంటాయి. వాటిలో చాలా వరకు నిరాధారమైనవిగా అనిపించవచ్చు, కానీ ఇది వారికి ప్రధాన భయం సమస్య కావచ్చు. చీకటి భయం, ఒంటరిగా ఉండాలనే భయం, కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తులను కలవాలనే భయం మొదలైనవి.

 
ఇది కాకుండా, ఒత్తిడి కారణంగా, కొంతమంది పిల్లలు రాత్రి నిద్రలోనే  మూత్ర విసర్జన చేస్తారు. కొందరు రాత్రి నిద్రపోలేరు, ఒకవేళ నిద్రపోతే భయంకరమైన కలలు వస్తుంటాయి. ఆకలి తగ్గిపోతుంది. తలనొప్పి లేదా కడుపునొప్పి లేదంటే, శరీరంలోని ఏదో ఒక భాగంలో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. 

పిల్లల ఒత్తిడిని ఇలా తగ్గించండి.. 

మీ బిడ్డ పరిపూర్ణంగా ఉండాలని ఒత్తిడి చేయవద్దు. మీ పిల్లలను వివిధ తరగతుల్లో చేరేలా చేయడం ద్వారా అతన్ని ఆల్ రౌండర్‌గా మార్చాలనే మీ కోరికను అతనిపై ఎక్కువగా రుద్దవద్దు.
ప్లే గ్రౌండ్ లో ఆటలు ఆడటానికి, ప్రకృతిలో కొంత సమయం గడపడానికి పిల్లలను ప్రోత్సహించండి. సోషల్ మీడియా, స్క్రీన్ సమయాన్ని వీలైనంత తగ్గించడం ఉత్తమం. శ్వాస వ్యాయామాలు చేయండి. పిల్లలతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండండి. వారి ఆలోచనలను గమనించండి. 

ఇది కూడా చదవండి..వెన్నెముక సమస్యలు రాకుండా ఏం చేయాలంటే..?

ఇది కూడా చదవండి..మొబైల్,ల్యాప్‌టాప్‌ ఎక్కువగా ఉపయోగిస్తున్నారా..? ఈ వ్యాధులు తప్పవు.. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.  

 

Tags : mental-health mental-tensions stress kids-health kids-health-care children-health-tips mental-problems mental-issues stress-mind children mental-health-problems mental-stress
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com