Digital Stress : డిజిటల్ స్ట్రెస్ కు ప్రధాన కారణాలు.. మీరు కూడాఈ తప్పులు చేస్తున్నారా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఉదయం లేవగానే మొబైల్ చూడటం.. రాత్రి పడుకునేదాకా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం.. మీటింగ్ అయిపోయినా మెయిల్స్‌కు స్పందించాల్సిన ఒత్తిడి.. ఇలాంటివి నేటి డిజిటల్ యుగంలో దాదాపు అందరి దినచర్యలో భాగమైపోయాయి. సాంకేతికత మన పనులను సులభతరం చేసినప్పటికీ, దాని అతి వినియోగం మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్నే 'డిజిటల్ స్ట్రెస్' అని పిలుస్తారు.

 

ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

ఎందుకు వస్తుంది..?

గంటల తరబడి ఫోన్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లు చూస్తుండటం వల్ల మెదడు నిరంతరం సమాచారాన్ని జీర్ణించుకోవాల్సి వస్తుంది. దీనివల్ల కంటి అలసట, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రతి మెసేజ్‌కు, ప్రతి అలర్ట్‌కు వెంటనే స్పందించాలన్న తపన మనసును నిరంతరం అప్రమత్తంగా ఉంచుతుంది. ఫలితంగా ఏకాగ్రత దెబ్బతిని, మానసిక అలసట పెరుగుతుంది.ఇతరుల జీవితాలను, విజయాలను చూసి తమ జీవితంతో పోల్చుకోవడం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. లైక్‌లు, ఫాలోవర్ల సంఖ్య గురించిన ఆలోచనలు అదనపు ఒత్తిడిని తెచ్చిపెడతాయి. పని, వ్యక్తిగత జీవితం మధ్య గీత చెరిగిపోవడం.. వర్క్ ఫ్రమ్ హోమ్ పెరిగాక, ఆఫీసు వేళలు ముగిసినా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాలన్న భావన చాలామందిలో ఒత్తిడిని కలిగిస్తోంది.

గుర్తించాల్సిన లక్షణాలు.. 

పదేపదే ఫోన్ చెక్ చేయాలనిపించడం, చిరాకు, అశాంతి, నిద్ర సరిగా పట్టకపోవడం, ఏకాగ్రత తగ్గడం, పనిపై ఆసక్తి కోల్పోవడం, ఫోన్‌కు దూరంగా ఉంటే ఆందోళన చెందడం వంటివి డిజిటల్ ఒత్తిడి సంకేతాలు కావొచ్చు.

ఎలా అధిగమించాలి..?

ఫోన్, ల్యాప్‌టాప్ వాడకానికి రోజువారీ సమయ పరిమితి పెట్టుకోవడం..రోజులో కొంత సమయం స్క్రీన్‌లకు దూరంగా గడపడం..అత్యవసరం కాని యాప్‌ల నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయడం..నిద్రకు కనీసం అరగంట ముందు స్క్రీన్‌లను పక్కన పెట్టడం..యోగా, వ్యాయామం, పుస్తక పఠనం, కుటుంబ సభ్యులతో గడపడం వంటివి అలవాటు చేసుకోవాలి. డిజిటల్ పరికరాలను పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేదు, వాటిని పరిమితంగా వాడడంతోపాటు చిన్న చిన్న మార్పులతో డిజిటల్ ఒత్తిడిని సమర్థంగా అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.