సాక్షి లైఫ్ : చుట్టూ జనం ఉన్నా, మనసులో మాత్రం ఒంటరి(Loneliness)గా ఉన్నామనే భావన చాలామందికి వస్తుంది. ఆధునిక కార్యాలయాలలో ఈ ఒంటరితనం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఇది కేవలం శారీరక దూరం వల్ల వచ్చేది కాదు, మానసిక, సామాజిక అనుబంధాలు లేకపోవడం వల్ల వస్తుంది. ఈ ఒంటరితనం ఉద్యోగుల పనితీరు, మానసిక ఆరోగ్యంతోపాటు, మొత్తం జీవనశైలిపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు(Psychologists) చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
పనిచోట ఒంటరితనం రకాలు.. (Types of loneliness in the workplace)..
పనిచోట ఒంటరితనం సాధారణంగా రెండు రకాలుగా కనిపిస్తుంది.. భావోద్వేగ ఒంటరితనం (Emotional loneliness) : సన్నిహిత, సహాయక సంబంధాలు లేకపోవడం. సామాజిక ఒంటరితనం(Social loneliness): అర్థవంతమైన సమూహ పరస్పర చర్యలు లేదా సహకారం లేకపోవడం.
పనిలో ఒంటరిగా ఉన్నవారిలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.. ఉదాహరణకు, గ్రూప్ గా ఉన్నపుడు పనిపై శ్రద్ధ లేకపోడం, చర్చలలో పాల్గొనక పోవడం, సమావేశాల పట్ల ఆసక్తి చూపకపోవడం వంటివి. కాలక్రమేణా, ఉద్యోగులు అలసిపోయి, మానసికంగా నిస్సత్తువగా మారవచ్చు.
(mental health)మానసిక ఆరోగ్యంపై తీవ్రప్రభావం..
పనిలో నిరంతర ఒంటరితనం (loneliness) కారణంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. బాధ, నిస్సహాయత, ఆందోళన వంటి భావాలు పెరుగు తాయి. విపరీతమైన ఒత్తిడి, మానసిక అలసట పెరిగి బర్న్‌అవుట్ అయ్యే ప్రమాదం ఎక్కువ. పనిపై ఆసక్తి తగ్గుతుంది. పని, వ్యక్తిగత జీవితం రెండింటిలోనూ సంతృప్తి తగ్గుతుంది.
శారీరక, సామాజిక పరిణామాలు..
మానసిక ఆరోగ్య సమస్యలే కాకుండా, కార్యాలయంలో ఒంటరితనం శారీరక, సామాజిక సమస్యలకు కూడా దారితీస్తుంది.
నిద్రలేమి, అలసట..
పెరిగిన ఒత్తిడికారణంగా (Immune system)రోగనిరోధక శక్తి బలహీనమవుతుంది. ఇంటా, బయట కూడా సంబంధాలు దెబ్బతినడం.
అనారోగ్యకరమైన అలవాట్లకు బానిస అవ్వడం, అంటే మద్యం, ధూమపానం వంటి చెడు అలవాట్లు చేసుకోవడం జరుగుతుంది.
ఆఫీస్ లో ఒంటరితనానికి గల కారణాలు..
రిమోట్ లేదా హైబ్రిడ్ ఉద్యోగాలు(Remote or hybrid jobs) అనధికారిక పరస్పర చర్యలను తగ్గించడం.
పోటీతత్వం లేదా హెల్ప్ లెస్ ఆఫీస్ కల్చర్..
ఉద్యోగుల తొలగింపుల వంటి సంస్థాగత మార్పులు సామాజిక బంధాలను దెబ్బతీయడం.
ఆఫీస్ లో ఒంటరితనాన్ని ఎలా తగ్గించాలి..?
ఈ సమస్యను తగ్గించడానికి సంస్థలతోపాటు, ఉద్యోగులు కొన్ని అంశాలపై దృష్టి పెట్టాలని సైకాలజిస్టులు వెల్లడిస్తున్నారు..
సంస్థలు (organizations)చేయాల్సినివి..
కలిసిమెలిసి ఉండే సంస్కృతిని ప్రోత్సహించడం. అంటే ఎవరికీ వారే ఉండకుండా అందరితో కలివిడిగా ఉండడం చాలా అవసరం. టీమ్-బిల్డింగ్ కార్యకలాపాలను నిర్వహించడం. అంటే ఒక్కో టీమ్ కు ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండేలా ప్రోత్సహించడం..హైబ్రిడ్ ఉద్యోగులు(వర్క్ ఫ్రమ్ హోమ్) work from home కూడా కనెక్ట్ అయ్యేలా చూడటం.
ఉద్యోగులు(employees) చేయాల్సినవి..
సహోద్యోగులతో సానుకూల సంబంధాలను ఏర్పరచుకోవడం.పనితో పాటు, బయట కూడా అందరితో కలిసి ఉండేలా ప్రయత్నించడం.
ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాల కోసం మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com