గుండెపోటు, గుండెల్లో మంటకు తేడాను ఎలా గుర్తించాలి..?  

సాక్షి లైఫ్ : గుండెపోటు, గుండెల్లో మంట లక్షణాలు రెండూ దాదాపు ఒకేలా ఉంటాయి. ఈ కారణంగానే చాలామంది గుండె మంటను కాస్తా గుండెపోటు అనుకునేందుకు, గుండెపోటును కాస్తా గుండె మంటగా భావించేందుకు అవకాశముంది.  రెండింటి మధ్య తేడా గుర్తించలేకపోవడం వల్ల  చాలామంది హైరానా పడిపోతుంటారు. అసలు గుండెపోటు , గుండెల్లో మంట వచ్చినప్పుడు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..? వాటిని ఎలా గుర్తించాలి..? 

గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే..? 

కొన్నిసార్లు ఈ సమస్యలను గుర్తించడానికి వైద్యులు కూడా పేషంట్లు చెప్పిన లక్షణాలను అర్థం చేసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఏంటి..? అనేది తెలుసుకోవాలి.?  కొన్ని లక్షణాల సమూహమే ఇది. కొంతమందికి కడుపులో ఇబ్బందిగా ఉన్నా, మంటగా ఉన్నా, ఛాతికి, కడుపుకి మధ్య నొప్పిగా ఉన్నా, గ్యాస్ అనుకుంటారు. 

జీర్ణ క్రియకు సంబంధించిన సమస్య.. 

మరికొంతమంది పొట్ట ఉబ్బరంగా ఉన్నా, తేన్పులు ఎక్కువగా వచ్చినా..కింది నుంచి గాలి పోయినా గ్యాస్ ట్రబుల్ అనుకుంటారు. ఏదేమైనా గ్యాస్ ట్రబుల్ అనేది పొట్టకు జీర్ణ క్రియకు సంబంధించిన సమస్యగా పరిగణించవచ్చు. మొత్తం మీద పేషంట్ల కంప్లెయింట్స్ ను పరిశీలిస్తే వందకు ఎనభై శాతం అసిడిటీకి సంబంధించినవే ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

 డిఫెన్స్ మెకానిజం.. 

 అసిడిటీ అంటే ప్రకృతి మనకు ఇచ్చిన డిఫెన్స్ మెకానిజం. ఇది మన తీసుకున్న ఆహారంలో ఉండే బ్యాక్తీరియాను చంపేయడానికి పనికి వస్తుంది. అయితే ఈ యాసిడ్ అవసరమైన దానికంటే ఎక్కువగా ఉత్పత్తి ఐతే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి.. అప్పుడు మన పేగుల గోడలపై పనిచేస్తూ ఆకలిగా అనిపిస్తుంది. అలా ఆకలి అయినప్పుడు మంటగా కూడా అనిపిస్తుంది. 

 అసిడిటీ.. 

యాసిడ్ తయారై సిద్ధంగా ఉంటుంది. కానీ ఆ సమయానికి ఫుడ్ వెళ్ళదు. ఫుడ్ తినగానే గ్యాస్ మంట తగ్గిపోతుంది. అంతేకాదు స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అసిడిటీ పెరుగు తుంది. ఆ బాడీలో ఎక్కువగా యాసిడ్ ఉంటేకూడా గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తుతుంది. 

తేన్పుల రూపంలో.. 

ఆసమయంలో కూడా కడుపులో గానీ, చాతిలోగానీ మంట వస్తుంది. ఆహారం తినేటప్పుడు మనం కొంతవరకు గాలిని మింగుతాము.. అలా మింగిన గాలే గ్యాస్ రూపంలోగానీ తేన్పుల రూపంలో గానీ బయటికివస్తుంది. కొంతమంది భోజనం చేసేటప్పుడు ఎక్కువ గాలిని మింగుతారు. 

అలాంటివాళ్లలో తేన్పులు ఎక్కువగా వస్తాయి. దుర్వాసనతో కూడిన గ్యాస్ ను కూడా కొంతమంది గ్యాస్ట్రిక్ సమస్యగా భావిస్తారు. శరీరంలో యాసిడ్ పెరగడంవల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ను గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గా చెబుతారు. అన్నవాహికలోఉండే గ్యాస్ పైకి తన్నడం వల్ల గుండెలో మంటగా అనిపిస్తుంది. 


ఎక్కువమంది లోవచ్చే సమస్య ఇదే..

ఉండాల్సినదానికంటే యాసిడ్ ఎక్కువగా ఉన్నా గానీ అన్నవాహికలోకి వచ్చినప్పుడు అసిడిటీ సమస్యగా భావిస్తారు. ఎక్కువమంది లోవచ్చే సమస్య ఇదే.. వందకు 50 నుంచి 60 మందికి ఈ ప్రాబ్లమ్ వస్తుంది. మిగిలిన పేషంట్లకు మాత్రమే గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. 

మానసిక ఒత్తిడి, ఒబెసిటీ, కారణంగా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. గుండె నొప్పికి మంటకు తేడా ఏంటంటే..? గుండె మీద ఒక మనిషి కూర్చొని నొక్కినట్లు ఉండేది" హార్ట్ పెయిన్". అదే గ్యాస్ సమస్య అయితే ఛాతీభాగంలో మాత్రమే వస్తుంది. 

గుండెనొప్పి.. 

 గుండె నోపి నడిస్తే ఎక్కువ అవుతుంది. కూర్చుంటే తగ్గుతుంది. "నైట్రేట్" అనే టాబ్లెట్ వేసుకుంటే గుండెనొప్పి తగ్గుతుంది. అదే గ్యాస్ నొప్పి తగ్గదు. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్నవారికి సహజంగా గుండె నొప్పి రాదు. చాలా రేర్ కేసెస్ లో మాత్రమే 30 ఏళ్ల వయసున్న వారిలో గుండెనొప్పి వచ్చేఅవకాశం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు.    

ఇది కూడా చదవండి.. గుండె జబ్బులు రాకుండా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : health-news-updates
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com