పిల్లలలో థైరాయిడ్ సంబంధిత సంకేతాలను ఎలా గుర్తించవచ్చు అంటే..?   

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : థైరాయిడ్ అనేది గొంతు దగ్గర సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఒక గ్రంథి. ఇది గుండె, మెదడుతోపాటు ఇతర శరీర భాగాలు సక్రమంగా పని చేయడానికి సహాయపడే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. మామూలు భాషలో చెప్పాలంటే ఈ గ్రంథి శరీరంలో బ్యాటరీ వలె పనిచేస్తుంది. 

ఇది కూడా చదవండి.. పిల్లలలో టైప్-2 డయాబెటీస్‌ కు కారణాలు..?

ఇది కూడా చదవండి.. సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

 

 కొన్ని సంవత్సరాల క్రితం వరకు, థైరాయిడ్ సమస్య అనేది పెద్దలకు సంబంధించిన సమస్యగా మాత్రమే కనిపించేది. అయితే ప్రస్తుతం థైరాయిడ్ వ్యాధి పిల్లలకు కూడా వస్తోంది. థైరాయిడ్  సమస్యను నివారించడానికి ముందుగా పిల్లలలో కనిపించే లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. అది ఎలాగో తెలుసుకుందాం..

శరీరంలో అధికంగా హార్మోన్లు ఎక్కువగా ఉంటే " హైపర్ థైరాయిడిజం" అని , తక్కువగా ఉంటే హైపోథైరాయిడిజం అని అంటారు. హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయితే కొన్నిరకాల సమస్యలు తలెత్తుతాయి. తగ్గితే కూడా ఇంకొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు లేని కారణంగా చాలా మందిలో థైరాయిడ్ సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. 

పిల్లలలో టీ.ఎస్.హెచ్ స్థాయి..?

థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్(టీ.ఎస్.హెచ్) పరీక్ష ద్వారా థైరాయిడ్ లెవల్స్ ను గుర్తించవచ్చు. 0 నుంచి 2 వారాల శిశువులో టీ.ఎస్.హెచ్ స్థాయి 1.6-24.3 mU/L ఉండాలి. అదే 2 నుంచి 4 వారాల పిల్లలలో టీ.ఎస్.హెచ్ సాధారణ స్థాయి 0.58-5.57 mU/L గా ఉండాలి. 20 వారాల నుంచి 18 సంవత్సరాల పిల్లలలో థైరాయిడ్ సాధారణ స్థాయి 0.55-5.31 mU/L గా ఉంటుంది. గుర్తుంచు కోండి.. వీటి కంటే ఎక్కువ లేదా తక్కువ టీ.ఎస్.హెచ్ స్థాయి  కలిగి ఉంటే థైరాయిడ్ సమస్య ఉన్నట్లే.

ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..? 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

  ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.