బరువు తగ్గడానికి చేయాల్సినవి..? చేయకూడనివి..? 

సాక్షి లైఫ్ : ఇటీవల చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఐతే కొందరి శరీరతత్వాన్ని బట్టి బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా కాస్త కష్టమే. ముఖ్యంగా మంచి పౌష్టికాహారం, కొవ్వులతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా బరువు పెరగడం సులభమే. కానీ దాన్ని తగ్గించుకోవాలంటే మాత్రం కొంచెం కష్టంగా అనిపిస్తుంది.

ఇందుకు చాలా మంది సినీ తారలు కూడా నిదర్శనం. నిత్యం యోగా చేసే సినీతారల వంటి సెలబ్రిటీలే ఇంత కష్టపడుతుంటే.. మనలాంటి సామాన్యులు బరువు తగ్గడం సాధ్యమేనా అని నిరాశ పడొద్దు. బిజీ లైఫ్‌ వల్ల చాలామందికి వ్యాయామం చేయడానికి సమయం దొరకక పోతుండవచ్చు. అలాగని డైటింగ్‌ చేస్తూ కడుపు మాడ్చుకోవడం కూడా కష్టమే. అందుకే చాలామంది సులభంగా బరువు తగ్గే మార్గాలను ఎంచుకుంటారు. అలాంటివారికి ఈ కింది చిట్కాలు ఉపయోగ పడవచ్చు.

వేగంగా బరువు తగ్గాలనుకుంటే..?

మంచి నీటిని తరచు తాగడం వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాం. ముఖ్యంగా భోజనానికి ముందు నీరు తాగడం వల్ల కొద్దిగా తింటే చాలు పొట్ట నిండిన భావన కలుగుతుంది. 12 వారాలపాటు చేసిన ఓ అధ్యయనంలో భోజనానికి ముందు నీళ్లు తాగని వారితో పోలిస్తే.. తాగేవారు త్వరగా బరువు తగ్గుతార ని తేలింది.

అలాగే కంటినిండా నిద్ర పోయినా బరువు తగ్గతారని పరిశోధనలో తేలింది
టీవి చూస్తూనో సెల్‌ ఫోన్‌ చూస్తూ కూడా తిన్నా బరువు పెరుగుతారట. ఇలాంటి అలవాటును మానుకునే యత్నం చేసినా బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ మూడు టెక్నిక్‌లు ఫాలో అయితే స్పీడ్‌గా బరువు తగ్గొచ్చు


ఈజీగా బరువు తగ్గేందుకు ఏం చేయాలో..ఏం చేయకూడదో చూద్దాం.

ఆహారాన్ని కంగారుగా తినకూడదు. నెమ్మదిగా నమిలి తినాలి. దీనివల్ల తక్కువ ఆహారం తీసుకుంటారు.నెమ్మదిగా ఆహారం తీసుకోవడం వల్ల కడుపు త్వరగా నిండిన ఫీలింగ్‌ వస్తుంది.

మీరు రోజూ తీసుకొనే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండాలి.
ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు త్వరగా నిండుతుంది.
ఆకలి తగ్గితే శరీరంలోకి తక్కువ క్యాలరీలు చేరతాయి. జీఎల్‌పీ–1, ఘెర్లిన్‌ హార్మోన్లపై ప్రొటీన్లు ప్రభావం చూపడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.

డ్రింక్స్‌ వల్ల రోగాల ముప్పు.. 

కూల్ డ్రింక్స్ తాగకూడదు. సోడా కలిగిన డ్రింక్స్‌ వల్ల రోగాల ముప్పు పెరుగుతుంది. చక్కెర శాతం ఎక్కువగా ఉండే పానీయాల వల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయి. కంటి నిండా నిద్రలేకపోయినా సరే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
నిద్రలేమి వల్ల లెప్టిన్, ఘెర్లిన్‌ హార్మోన్లపై ప్రభావం పడుతుంది.

ఒత్తిడి వల్ల కార్టిసాల్‌ అనే హార్మోన్‌ విడుదలై ఆకలి పెరుగుతుంది.
ఆకలి పెరగడం వల్ల అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు.
దానివల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయి. నిద్రలేమి, ఒత్తిడి వల్ల మధుమేహం, ఊబకాయం వంటి అనేక రుగ్మతలు వస్తాయి.

పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం..  
 
యోగర్ట్, లెంటిల్స్, క్వినోవా, చికెన్‌ బ్రెస్ట్, చేపలు, ఆల్మండ్స్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల తొందరగా ఆకలి వేయదు.మొక్కల నుంచి లభించే విస్కోస్‌ ఫైబర్‌ అనే పీచుపదార్థం బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.
బీన్స్, ఓట్స్‌ సెరల్స్, బ్రస్సెల్స్‌ స్ప్రౌర్ట్స్, ఆస్పరాగస్, నారింజ, అవిసె గింజల్లో విస్కోస్‌ ఉంటుంది.

ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి..?

ఎక్కువగా భోజనం చేస్తే బరువు కూడా అదే స్థాయిలో పెరుగుతారు. ఆకలి వేసినప్పుడు మధ్య మధ్యలో బాదం తదితర డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవడం ఉత్తమం. టీవీ లేదా ల్యాప్‌టాప్‌లో సినిమాలు, వీడియోలు చూస్తూ తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు. ఎందుకంటే.. వాటి ధ్యాసలో పడి అతిగా తినేస్తారు కాబట్టి. మితంగా తినడం బెటర్.
  
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : weight-loss
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com