దోమల ద్వారా వ్యాపించే 3 అత్యంత తీవ్రమైన వ్యాధులు..
సాక్షి లైఫ్ : ఆగస్టు 20, 1897న బ్రిటిష్ వైద్యుడు సర్ రోనాల్డ్ రాస్ ఆడ అనాఫిలిస్ దోమను కనుగొన్నాడు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నుంచి విముక్తి చేయడంతోపాటు, ఆయా వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ఏమిటి..? వాటిని ఎలా నివారించాలి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
డెంగ్యూ..
ఈ వ్యాధి ఏడెస్ అల్బోపిక్టస్, ఏడెస్ ఈజిప్టి ద్వారా వ్యాపిస్తుంది. వర్షాకాలంలో, డెంగ్యూ కేసులు ఎక్కువగా కనిపిస్తాయి. డెంగ్యూ జ్వరాన్ని ఎముకలు విరిచే జ్వరం అని కూడా అంటారు. డెంగ్యూ ఇన్ఫెక్షన్ తీవ్రమైన రూపాన్ని తీసుకున్నప్పుడు, డెంగ్యూ హెమరేజిక్ జ్వరం ప్రమాదం పెరుగుతుంది. ఇది భారీ రక్తస్రావం, అకస్మాత్తుగా రక్తపోటు తగ్గుదల, ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం సంభవించవచ్చు. డెంగ్యూ జ్వరం లక్షణాలు, ఇది సాధారణంగా ఇన్ఫెక్షన్ తర్వాత నాలుగు నుంచి ఆరు రోజుల వరకు ప్రారంభమై 10 రోజుల వరకు ఉంటుంది. ఇందులో అధిక జ్వరం, తలనొప్పి, కీళ్ల-కండరాల నొప్పి, అలసట, వికారం, వాంతులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు వస్తాయి.
మలేరియా..
మలేరియా ఆడ అనాఫిలిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఈ దోమలు మురికి, కలుషితమైన నీటిలో వృద్ధి చెందుతాయి. ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణం పరాన్నజీవి. మలేరియా దోమ ఉదయం లేదా సాయంత్రం కుడుతుంది. మలేరియా లక్షణాలు తల తిరగడం, శ్వాస ఆడకపోవడం, జ్వరం. ఈ లక్షణాలలో దేని ప్రభావం ఎక్కువ కాలం కొనసాగితే, ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
ఎల్లో ఫీవర్..
ఇది ఏడిస్ ఈజిప్టి దోమల ద్వారా వ్యాప్తి చెందే తీవ్రమైన వైరల్ వ్యాధి, ఇది డెంగ్యూ జ్వరం, చికున్‌గున్యా ,జికా ఫీవర్ కూడా వ్యాపిస్తుంది. ఆఫ్రికా , దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో పసుపు జ్వరం చాలా సాధారణ వ్యాధి. ఈ వ్యాధి లక్షణాలు మలేరియాను పోలి ఉంటాయి, కానీ వికారం, వాంతులు, కామెర్లు కూడా ఉంటాయి. ఏవైనా లక్షణాలు కనిపిస్తే, ఎక్కువ ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి.
నివారణ ఎలా..?
- వర్షాకాలంలో ఇంటి లోపల లేదా వెలుపల ఎక్కడా నీరు నిల్వ ఉండనివ్వకండి.
- మాన్ సూన్ సీజన్ లో తలుపులు, కిటికీలను దోమతెరలతో కప్పి ఉంచండి.
- ముఖ్యంగా పిల్లలకు బయటకు వెళ్ళే ముందు దోమలను నివారించే మందులు వాడండి.
- కాళ్లు, చేతులు నిండుగా ఉండేలా దుస్తులు ధరించండి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
