Parkinsonian Disorders : ఏఐతో పార్కిన్సోనియన్ వ్యాధుల నిర్ధారణలో ఎంఆర్‌ఐ మరింత కచ్చితత్వం..!
సాక్షి లైఫ్ : పార్కిన్సన్ వ్యాధి (Parkinson's Disease), దానికి సంబంధించి న ఇతర నాడీ సంబంధిత రుగ్మతలను (Parkinsonian disorders) తొలిదశలోనే కచ్చితంగా గుర్తించడం ఇప్పుడు మరింత సులభం కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ఎంఆర్‌ఐ (MRI) స్కానింగ్‌ల ఖచ్చితత్వం అసాధారణంగా పెరిగిందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ కొత్త ఆవిష్కరణ రోగులకు సరైన, సకాలంలో చికిత్స అందించడానికి గొప్ప మార్పును తేనుంది.
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
96శాతం కచ్చితత్వంతో AIDP సాఫ్ట్‌వేర్..
సాధారణంగా, పార్కిన్సన్ వ్యాధి లక్షణాలు దాని సంబంధిత ఇతర రుగ్మతలైన మల్టిపుల్ సిస్టమ్ అట్రోఫీ (MSA), ప్రోగ్రెసివ్ సుప్రాన్యూక్లియర్ పాల్సీ (PSP) వంటి వాటి లక్షణాలతో చాలావరకు పోలి ఉంటాయి. దీనివల్ల తొలి ఐదేళ్లలో వ్యాధిని నిర్ధారించే కచ్చితత్వం 55శాతం నుండి 78శాతం మాత్రమే ఉండేది. దాదాపు నలుగురిలో ఒకరికి తప్పుడు నిర్ధారణ అయ్యే ప్రమాదం ఉండేది.
అయితే, అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా పరిశోధకులు 'ఆటోమేటెడ్ ఇమేజింగ్ డిఫరెన్సియేషన్ ఫర్ పార్కిన్సోనిజం' (AIDP) అనే ఒక వినూత్న సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. ఈ AIDP సాఫ్ట్‌వేర్ డిఫ్యూజన్-వెయిటెడ్ ఎంఆర్‌ఐ (Diffusion-weighted MRI) స్కాన్‌లను వినియోగి స్తుంది. ఈ స్కాన్‌లు మెదడులోని నీటి అణువుల కదలికలను కొలవడం ద్వారా, నాడీ క్షీణత (Neurodegeneration) ఎక్కడ జరుగుతుందో గుర్తించగలుగుతుంది.
అద్భుత ఫలితాలు.. ఈ మెషీన్ లెర్నింగ్ (Machine Learning) అల్గారిథమ్ పార్కిన్సన్ వ్యాధి, దాని ఇతర రకాలను 96శాతం కచ్చితత్వంతో వేరు చేసి గుర్తించగలుగుతోందని పరిశోధకులు తెలిపారు.
నిపుణుల కంటే మెరుగ్గా..
కొన్ని కష్టతరమైన కేసులలో అనుభవజ్ఞులైన న్యూరాలజిస్టుల కంటే కూడా ఈ ఏఐ టూల్ మెరుగ్గా పనిచేసినట్లు తేలింది. పోస్ట్‌మార్టం నిర్ధారణలతో పోల్చగా, క్లినికల్ నిర్ధారణ కచ్చితత్వం 82శాతం ఉంటే, AIDP కచ్చితత్వం "94శాతం"గా నమోదైంది.
ముందస్తు చికిత్సకు మార్గం..
వ్యాధిని త్వరగా, కచ్చితంగా గుర్తించడం వల్ల రోగులకు సరైన సమయంలో చికిత్స అందించడం, వారి జీవన నాణ్యతను మెరుగుపరచడం సాధ్యమవుతుంది. సరైన నిర్ధారణకు పట్టే సమయం తగ్గుతుంది. ఈ ఏఐ టూల్ వివిధ ఎంఆర్‌ఐ స్కానర్‌లతో పనిచేస్తుంది, దీనివల్ల పెద్ద ఆసుపత్రుల నుంచి చిన్న క్లినిక్‌ల వరకు కూడా ఈ సేవలను విస్తరించవచ్చు. ఈ ఏఐ ఆధారిత సాంకేతికత నాడీ సంబంధిత రుగ్మతల చికిత్సా రంగంలో ఓ విప్లవాత్మక మార్పును తీసుకురానుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
