Amazing Health Benefits of Pumpkin Seeds : గుమ్మడి గింజల అద్భుత ప్రయోజనాలు తెలిస్తే వదలరు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సాధారణంగా ఇళ్లలో గుమ్మడికాయతో వంట చేసుకునేటప్పుడు, అందులోని గింజలను తీసి చెత్తబుట్టలో పడేస్తుంటారు. కానీ ఆ చిన్న గింజల్లో దాగున్న పోషకాల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. గుమ్మడి గింజలు (Pumpkin Seeds) మెగ్నీషియం, జింక్, ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులకు పవర్‌హౌస్‌ లాంటివి. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. గుమ్మడి గింజలను రోజూ తీసుకోవడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

 

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

 

1. మెగ్నీషియం గని..

శరీరంలో కండరాలు, నరాలు, ఎముకల పనితీరు మెరుగ్గా ఉండాలన్నా, రక్తపోటు (bp) అదుపులో ఉండాలన్నా మెగ్నీషియం చాలా అవసరం. గుమ్మడి గింజలను తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన మెగ్నీషియం పుష్కలంగా అందుతుంది.

2. గుండె ఆరోగ్యం..  

ఈ గింజల్లో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే (healthy fats) ఆరోగ్యకరమై న కొవ్వులు, శరీరానికి మేలు చేసే ఎన్నో ఖనిజాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే గుండె జబ్బులను పూర్తిగా నయం చేస్తాయని కాదు కానీ, ముందు జాగ్రత్తగా గుండెను కాపాడుకోవడంలో ఇవి మంచి ఆహారం.

3. రోగనిరోధక శక్తికి ‘జింక్’.. 

శరీరంలో రోగనిరోధక వ్యవస్థ చురుగ్గా పనిచేయడానికి, అలాగే గాయాలు త్వరగా మానడానికి 'జింక్' ఎంతో అవసరం. గుమ్మడి గింజల్లో ఈ జింక్ మెండుగా ఉంటుంది. ఇవి మిమ్మల్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తాయి.

4. జీర్ణవ్యవస్థకు మేలు.. 

జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే పీచుపదార్థం (fiber) చాలా ముఖ్యం. గుమ్మడి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేసి, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

5. బరువు నియంత్రణలో..

కొంచెం గుమ్మడి గింజలు తిన్నా ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్ కలయిక వల్ల పదేపదే ఆకలి వేయదు. చిరుతిళ్లకు బదులుగా వీటిని తింటే బరువు అదుపులో ఉంటుంది.

6. ఆహారంలో చేర్చుకోవడం చాలా తేలిక..

వీటిని తినడానికి ప్రత్యేకంగా వంటలు చేయాల్సిన పనిలేదు. చాలా సులభంగా మన రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవచ్చు.

గుమ్మడి గింజలను ఎలా తినాలి..?

దోరగా వేయించుకుని స్నాక్ లాగా తినొచ్చు. పండ్ల సలాడ్స్, వెజిటబుల్ సలాడ్స్‌ పైన చల్లుకుని తినొచ్చు. ఉదయం అల్పాహారంలో ఓట్స్ లేదా అటుకులు మీద కలుపుకోవచ్చు. పెరుగులో వేసుకుని లేదా స్మూతీస్ చేసుకుని తాగొచ్చు.

ఎంత మోతాదులో తినాలి..?

పోషకాలు ఉన్నాయి కదా అని అతిగా తినకూడదు. రోజుకు ఒక చిన్న గుప్పెడు లేదా 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల గింజలు తీసుకుంటే సరిపోతుంది. మోతాదు మించితే క్యాలరీలు పెరగడంతో పాటు, ఫైబర్ ఎక్కువై కడుపు ఉబ్బరం లేదా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏవైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డైటీషియన్ లేదా వైద్యుల సలహా మేరకు ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

 

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.